రెబ్బెన, జూన్ 9 : చెస్ క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రెబ్బెన మండలం గోలేటిటౌన్‌షిప్‌లో గల టీబీజీకేఎస్ కార్యాలయంలో చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-9,11,13,15, ఓపెన్ టు ఆల్ పోటీలను ప్రారంభించారు.
గెలుపొందిన వారికి చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరాజ్ ఉర్ రెహమాన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ ఈగ కనకయ్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో యోగాసన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్, చెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్, ప్రధాన కార్యదర్శి కల్పన, జాయింట్ సెక్రటరీ రవీందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు సమ్మయ్య, తిరుపతి, శృతిక, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.