రెబ్బెన, జూన్ 10 : హైదరాబాద్లో త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్షిప్ పోటీలకు పలువురు క్రీడాకారులు ఎంపికైన్నట్లు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్కుమా ర్, ప్రధాన కార్యదర్శి కల్పన ఓ ప్రకటనలో తెలిపారు.
గోలేటిటౌన్షిప్లో గల టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలలో ప్రతిభ కనబరిచిన పలువురు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అండర్-9 విభాగంలో దేవాన్ష్, శ్రీకాంత్, తన్విక, వినూత్న, శరత్, అండర్-13 విభాగంలో జాన్సన్, భార్గవ్, మేఘన, కృషిక, కౌశిత్ ఎంపికైనట్లు పేర్కొన్నారు.