చెన్నూర్: మంచిర్యాలలో జరిగిన 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో (athletics competitions) చెన్నూరు శర్వాణి పాఠశాల (Sharvani school) విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఓరల్ ఛాంపియన్ చిప్ సాధించారని కరస్పాండెంట్ మేడ శ్రవణ్ రెడ్డి తెలిపారు.300 మీటర్ల పరుగు పందెంలో పి. శశాంక్ మొదటి స్థానం, లాంగ్ జంప్ లో 2వ స్థానం, 60 మీటర్ల పరుగు పందెంలో పి.హరికృష్ణ మొదటి స్థానం, లాంగ్ జంప్ లో మొదటి స్థానం సాధించారని వెల్లడించారు.
300 మీటర్ల పరుగు పందెంలో టి.అశ్విని మొదటి స్థానం, 60 మీటర్ల పరువు పందెంలో మొదటి స్థానం, లాంగ్ జంప్‌లో డి.మనీషా మొదటి స్థానం, 300 మీటర్ల పరుగు పందెంలో రెండవ స్థానం, 60 మీటర్ల పరుగు పందెంలో రెండవ స్థానం సాధించిందని వివరించారు. పి.అశ్వంత్ జావీలైన్ త్రో 10 సంవత్సరాల విభాగంలో మొదటి స్థానం, జావీలైన్ త్రో 13 సంవత్సరాల విభాగంలో ఎన్.రాంచరణ్ మొదటి స్థానం సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థులను , కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.