సిర్పూర్(టీ), మార్చి 18 : మండలంలోని హుడ్కులీ అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద సిర్పూర్(టీ) ఎస్ఐ దీకొండ రమేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. సో మవారం చింతలమానేపల్లి మండలం డ బ్బా గ్రామానికి చెందిన కుమ్రం నరేశ్ మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు రూ. 5 లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నారు.
అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఎండీ ఆరీఫ్ బల్హర్షా నుంచి కాగజ్‌నగర్ పట్టణానికి వాహనంలో తీసుకెళ్తున్న 17 మిక్చర్ గ్రైండర్లను పట్టుకున్నారు. చెక్‌పోస్ట్ సిబ్బంది షోయబ్, ఎస్ఎస్టీ టీమ్ అధికారి వీణా, సిబ్బంది ఉన్నారు.
జన్నారం, మార్చి 18 : మండలంలోని ఇందన్పెల్లిలోని అంతర్ జిల్లా చెక్‌పోస్టు వద్ద సోమవారం రూ. లక్షా ఐదు వేలను పట్టుకున్నట్లు సీఐ అల్ల నరేందర్ లెలిపారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న డబ్బులను సీజ్ చేసి ఎన్నికల స్కాడ్‌కు అప్పగించినట్లు తెలిపారు.