నస్పూర్/ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 26 : వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టరేట్లలో చా కలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ మె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. కలెక్టర్లు మాట్లాడుతూ ఐలమ్మ వర్ధంతి, జయంతి ని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మోతీలాల్ దీపక్ తివారీ, వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి వినోద్‌కుమార్, రజక సంఘం అధ్యక్షుడు బాపు, వెంకటేశం, రాజేశం, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సజీవ న్, జిల్లా అధికారులు, ప్యాక్స్ అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు కడతల మల్ల య్య, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రూప్ నార్ రమేశ్, వైరగడే మారుతి, నాయకులు వేములవాడ గణపతి, సంతోష్, కడతల సాయి పాల్గొన్నారు.