నల్లనేలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ బూటకమని తేలిపోయింది. సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో ప్రజల సాక్షిగా ఆయన ప్రకటించి నెలరోజులు కాకముందే కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను కచ్చితంగా వేలం వేస్తామని పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించడం, విమర్శలకు తావిస్తున్నది. తమ వాటా తక్కువుందంటూనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కనీసం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సింగరేణి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసేలా అడుగులు వేస్తున్న కేంద్రం తీరుపై కార్మిక లోకం భగ్గుమంటున్నది. మరోవైపు సంస్థను కాపాడుకునేందుకు కార్మిక సంఘాల నాయకత్వం ఆందోళనలకు సిద్ధమవుతున్నది. ప్రభుత్వ విప్ ఆదేశాల మేరకు నేడు అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కాగా.. సింగరేణి ప్రైవేటీకరణపై పోరుకు నేటి(శుక్రవారం)తో యేడాది పూర్తయింది.
– మంచిర్యాల, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ప్రైవేటీకరణ చేయం..: మోదీ
“సింగరేణిని ప్రైవేటీకరణ చేయం. అయినా మా చేతిలో ఏమున్నది? సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51%. కేంద్రానికి ఉన్నది 49 శాతమే. ఏం చేయాలను కొన్నా రాష్ట్రం చేతిలోనే ఉంటుంది.” గత నెల 12న పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటన సందర్భంగా ప్రధానిమోదీ.
బ్లాకులను వేలం వేస్తున్నాం : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
“దేశవ్యాప్తంగా 38 బొగ్గు గనులను వేలం వేస్తున్నాం.. 20 గనుల వేలం పూర్తయింది.. సింగరేణి పరిధిలోని కల్యాణిఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి గనులను వేలం వేయనున్నాం.” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం లోక్‌సభ సాక్షిగా ప్రకటించారు.
సింగరేణికే కేటాయించండి.. : సీఎం కేసీఆర్
“గతేడాది డిసెంబర్ 7వ తేదీన సింగరేణిని ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్రానికి లేఖరాశాం. వేలాన్ని రద్దు చేసి ఆ నాలుగు గనులను సింగరేణికి కేటాయించాలని కోరాం. అయినా కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్టించుకోకుండా వేలం వేస్తున్నది.” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కార్మికుల పక్షాన నిలబడుతాం.. : మంత్రి కేటీఆర్
“సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. బొగ్గు బావులను వేలం వేయడం అంటే తాళం వేయడమే. ప్రైవేట్ పరం చేసి తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నది. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.” అని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
నిర్వీర్యం చేసే కుట్ర..
తాండూర్, డిసెంబర్ 8:మన రాష్ర్టానికే కా కుండా దక్షిణ భారత దేశమంతటికీ వెలుగులు పంచే సంస్థ సింగరేణి. అలాంటి వనరును ప్రైవేటీ కరణ చేయాలనుకోవడం సిగ్గుచేటు. కోల్ బ్లాక్‌ల ను వేలం వేసి ప్రైవేటీకరణకు దారులు తెరిస్తే సం స్థ మనుగడలో లేకుండా పోతుంది. సింగరేణిని నిర్విర్యీం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది. అసలు సిం గరేణి లేకుండా చేయాలన్నదే బీజేపీ పన్నాగం. సింగరేణిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు పరిశ్రమలు మనుగడ సాగిస్తున్నాయి. ప్రైవేటీకరణ జరిగితే లక్షలాది మంది రోడ్డున పడాల్సి వస్తుంది.
-బూర శ్రీనివాస్, హెడ్ ఓవర్‌మన్, అబ్బాపూర్ ఓసీపీ
మంచిర్యాల, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతిని ధి): కార్మికులు అనుకుంటున్నదే నిజమైంది. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదన్న కార్మిక సంఘాల గళం నిరూపితమైంది. సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో ప్రజల సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీ గాల్లో కలిసిపోయింది. ప్రకటించి నెల రోజులు కూడా కాకముందే, పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో లోకసభ సాక్షిగా కేంద్రం మాట తప్పింది. సింగరేణి గనుల వేలంపై టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బొగ్గుగనుల శాఖా మంత్రి ప్రహ్లా ద్ జోషి చేసిన ప్రకటన సింగరేణి ఉనికినే ప్రశ్నార్థకం చే సే విధంగా ఉం ది. దీనిపై కార్మికలోకం భగ్గుమంటున్న ది. మరోవైపు ఆందోళనకు సిద్ధమవుతామని కార్మిక సం ఘాల నా యకత్వం ప్రకటిస్తున్నది.
దేశవ్యాప్తంగా 38 బొగ్గు గనులను వేలం వేస్తున్నామని, 20 గనుల వేలం పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. సింగరేణిలోని కల్యాణిఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి గనులను వేలం వేయనున్నామని తెలిపారు. దీని పై టీఆర్ఎస్ ఎంపీలు తీ వ్రస్థాయిలో మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేట్‌పరం కా నివ్వబోమని స్పష్టంచేశారు. కేంద్రం వైఖరిని మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ ని, కేంద్రానిదే బాధ్యతని హెచ్చరించారు.
‘సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం కాగా, రాష్ట్రం వాటా 51 శాతం ఉన్నది. సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే. అలాంటప్పుడు కేంద్రం ఏకపక్షంగా సింగరేణిని ప్రైవేటీకరించడం సాధ్యం కాదు’ అని చెప్పారు. రామగుండం బహిరంగ సభలో ప్రైవేటీకరణ చేయబోమని చెప్పి.. చట్టసభల్లో ప్రైవేట్‌పరం చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొనడం బీజేపీ ద్వంద్వ నీతికి అద్దం పడుతున్నది. కాగా, వే లం లిస్టులో ఉన్న నాలుగు బొగ్గుబ్లాకుల్లో నిక్షేపాల ను గుర్తించేందుకు సింగరేణి సంస్థ రూ.55 కోట్లు ఖ ర్చు పెట్టింది. తీరా ఇప్పుడు వాటిని కేంద్రం వేలాని కి పెట్టడంతో సంస్థకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కాంగ్రెస్ హయాంలో క్యాపిటివ్ మైనింగ్‌ను కమర్షియల్ మైనింగ్గా మార్చగా, తాజాగా బీజేపీ ప్ర భుత్వం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ గనుల ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నది. ఇప్పటికే కో యగూడెం బ్లాక్‌ను ప్రైవేటుకు దారాధత్తం చేసింది.
అన్ని కంపెనీల్లాగే సింగరేణి కూడా ఇక వేలంలో పాల్గొనాలని కేంద్రం స్పష్టం చేఇంది. వేలంలో పాల్గొని కావాల్సిన బ్లాక్‌ను దక్కించుకోవచ్చని వాదిస్తున్నది. కార్పొరేట్ కంపెనీలతో పోటీపడి వేలంలో పాల్గొనడం కన్నా.. గతంలో మాదిరిగా నామినేషన్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు బ్లాక్‌లు కేటాయించాలనే డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఇప్పటికిప్పుడు సింగరేణికి 10 బ్లాక్‌లు ఇచ్చి రెండు, మూడేళ్లలో బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యం ఇచ్చినా చేసే శక్తి, సామర్థ్యం సంస్థకు ఉన్నాయి. పుష్కలమైన వనరులతో పాటు మ్యాన్‌పవర్ ఉంది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు కొన్ని ఎక్స్టర్నల్ భర్తీలు చేపట్టడంతో సంస్థకు 18వేల మ్యాన్‌పవర్ చేరింది. మొత్తం యువరక్తమే.. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ సింగరేణి సొంతం. ఇప్పటికే చాలాసార్లు ఇది నిరూపితమైంది. ప్రస్తుతం సింగరేణి లీజ్‌కు తీసుకున్న బ్లాక్‌లలో బొగ్గు ఉత్పత్తి మరో 20 నుంచి 25 ఏళ్లలో అయిపోతుంది. ఇక గనులను ప్రైవేట్‌కు అప్పగించుకుంటూ పోతే సింగరేణి సంస్థ అనేది ఒకటి ఉండేది అని చెప్పుకునే రోజు లు రావచ్చనేది నిజం.