భీమారం, జూలై 13 : భీమారం మండల కేంద్రంలోని మంచిర్యాల-చెన్నూర్ జాతీయ రహదారిపై రాత్రి వేళలో పశువులు రోడ్లపై సంచరిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నది. దీంతో తరచు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఈ ప్రమాదాల్లో ప్రయాణికులతో పాటు, పశువులూ గాయాలపాలవుతున్నాయి. యాజామానులు ఇండ్లలో పశువులను కట్టేసుకోవాలని పంచాయతీ సిబ్బంది ఇప్పటికే గ్రామంలో ప్రచారం చేశారు. అయినా పట్టించుకోడం లేదని, వాహన దారులు ప్రజలు వాపోతున్నారు. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.