నార్నూర్ : మద్యం సేవించి వాహనాలు ( Drunken Drive ) నడిపిస్తే చట్టరీత్యా చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని నార్నూర్ ఎస్సై అఖిల్( SI Akhil ) హెచ్చరించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ( Narnoor ) మండలం మాన్కాపూర్ గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులను పరీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని, వాహనదారులు, ప్రయాణికులు మద్యం సేవించి ప్రయాణం చేయరాదని సూచించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేయాలన్నారు. నిబ్బందులను ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. మైనర్లు వాహనాలను నడుపవద్దని సూచించారు. పలువురు వాహనదారులకు చాలన్లు విధించారు. పెండింగ్ లో ఉన్న చాలాన్లను చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.