నార్నూర్ : గంజాయి సాగు(Ganja cultivation )చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేస్తామని నార్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పీ. ప్రభాకర్ (CI Prabhakar ) హెచ్చరించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పర్సువాడ కే పంచాయతీ పరిధిలోని సారుగూడ గ్రామానికి చెందిన మర్సుకోల జంగు వ్యవసాయ పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పక్కా సమాచారం అందిందని వివరించారు.
పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించా మన్నారు. 16 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ రూ. లక్ష అరవై వేలు ఉంటుందన్నారు. జంగును అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై స్థానికులకు వివరిస్తామని వెల్లడించారు. ఎస్సై అఖిల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.