బేల, మే 25 : అమాయక ఆదివాసీ రైతులను ప్రజలను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను అమ్ముతున్న ఇద్దరిపై కేసు నమోదు చేయగా.. ఒకరి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం వివరాలను వెల్లడించారు. మండల కేంద్రంలోని సిర్సన్న గ్రామంలో అమాయక ఆదివాసీ రైతులను ప్రజలను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశామని తెలిపారు. ఇందులో సిర్సన్న గ్రామానికి చెందిన ఎండీ కుర్షిద్ వద్ద ఐదు కిలోల లూజ్ నకిలీ విత్తనాలు, 23 నకిలీ విత్తన ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు. అతడిని విచారించగా.. తన బావ మహారాష్ట్రలోని మహమూద్ వద్ద 10 కిలోల లూజు నకిలీ విత్తనాలు, 26 ప్యాకెట్లను కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. బాది గ్రామంలో జలపతికి ఐదు కిలోల విత్తనాలను రూ.13 వేలకు.. జుగ్నకే శంభుకు మూడు ప్యాకెట్లను రూ.1200లకు విక్రయించినట్లు తెలిపాడు. ఇద్దరిపై బేల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమాచారం ఉన్న టాస్క్‌ఫోర్స్ సీఐ 8712659965 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.
ఇచ్చోడ, మే 25 : ప్రత్యేక టాస్‌ఫోర్స్ బృందాల ద్వారా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. ఇచ్చోడ ఏవో రమేశ్ ఫిర్యాదు మేరకు మండలంలో దాడులు నిర్వహించి 39 నకిలీ విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇస్లాంనగర్‌కు చెందిన జాదవ్ గజానంద్, కోకస్ మన్నూర్ గ్రామానికి చెందిన కంది శివకుమార్, కొతపల్లి రవీందర్, ముక్రా(బీ) గ్రామానికి చెందిన ఆదవ్ రవికాంత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.