ఆదిలాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడంలో అన్యాయం చేస్తున్నారనే ఆవేదనతో మనస్థాపం చెందిన బీసీల ముద్దుబిడ్డ సాయి ఈశ్వరచారి ( Ishwar Chari ) ఆత్మ బలిదానం వృధా పోదని మాజీమంత్రి జోగు రామన్న( Jogu Ramanna ) అన్నారు. ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి చౌక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సాయి ఈశ్వర చారి కి ఘన నివాళులు అర్పించారు.
42 శాతం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని బూటకపు హామీ ఇవ్వడంతో మనస్థాపం చెంది తన ప్రాణాలను బలి దానం చేయడంపై యావత్ బీసీ సంఘాలు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించాయి. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి , చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.