నేడు(ఆదివారం) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. శనివారం రాత్రి ఏడు గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్‌బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు సుమన్, రామన్న పాల్గొని నివాళులర్పించారు. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు.