మంచిర్యాల టౌన్ : మంచిర్యాల ( Mancherial ) ,అంతర్గంలో (Antaragam) మధ్య గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిని రద్దు చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు (Diwakar Rao ) అన్నారు. సోమవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి గోదావరి నది వద్దకు వెళ్లిన ఆయన నిరసన వ్యక్తం చేశారు . మంచిర్యాల , ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే వంతెనను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం హేయమైన చర్యని ఆరోపించారు.
రూ. 164 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ వంతెనను రద్దుచేసి రూ. 450 కోట్లతో ముల్కల మురుమూరుల మధ్య నిర్మించాలని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ సాగర రావు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీని ద్వారా ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగంగా ఉండదని పేర్కొన్నారు. మంచిర్యాల అంతర్గాంల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే 18 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వెల్లడించారు.