కోటపల్లి, జనవరి 8 : మండలంలోని జనగామ రూట్లో బుధవారం ఆర్టీసీ బస్ ప్రారంభమైంది. పది గ్రామాలకు పది నెలలుగా ఆర్టీసీ బస్ రాకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’ పలు కథనాలు ప్రచురించింది. గత నవంబర్ 4న ‘ఎమ్మెల్యే గారూ మాకూ మహాలక్ష్మీ కావాలి’ శీర్షికన కథ నం ప్రచురితం చేసింది. అయినా అధికారులు స్పం దించలేదు. అదే నెల 21న జనగామ, ఆలుగామ మా జీ సర్పంచ్లు గట్టు లక్ష్మణ్ గౌడ్, కుమ్మరి సంతోష్, రాజారం మాజీ ఎంపీటీసీ జేక శేఖర్ ఆధ్వర్యంలో చెన్నూర్ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. అ యినా బస్సు పున:రుద్ధరణకు నోచుకోలేదు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 15న ‘నమస్తే తెలంగాణ’లో ‘ఎమ్మెల్యేకు చెప్పినా బస్సు వస్తలే’ శీర్షికణ మరో కథనా న్ని ప్రచురించింది. సమస్య చిన్నదైనా పరిష్కారం కాకపోవడంతో పారుపల్లి, లింగన్నపేట, ఎదుల్లబం ధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, జనగామ, నం దరాంపల్లి, సూపాక గ్రామాల ప్రజలు ప్రస్తుత కాంగ్రె స్ పాలనపై విమర్శలు గుప్పించారు. అలాగే కోటపల్లి మండలానికి చెందిన మంత్రి రామయ్య కలెక్టర్ దృష్టి కి సైతం తీసుకెళ్లారు. ఇక డిసెంబర్లో జరిగిన అసెం బ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే వివేక్ ఒక అడుగు ముందుకేసి జనగామ రూట్లో బస్సు సేవలను పున: రుద్ధరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
అయి నా బస్సు సేవలు ప్రారంభం కాలేదు. ఇక మరోసారి ఈ నెల 5న ’నమస్తే తెలంగాణ’ ‘అసెంబ్లీలో మాట్లాడినా బస్సు రాలే’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. వ రుస కథనాల నేపథ్యంలో ఎమ్మెల్యేతో పాటు అధికారులపై ఒత్తిడి పెరిగింది. దీంతో చివరగా బుధవారం చెన్నూర్ నుంచి జనగామ వరకు బస్సును ప్రారంభించారు. చాలా రోజుల తర్వాత జనగామ రూట్లో బస్సు ప్రారంభం కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. బస్సుకు ఘన స్వాగతం పలికారు. కాగా, ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించడం.. బస్సు సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.