ఇంద్రవెల్లి: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ( Indravelli ) మండలంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy) చిత్రపటాలను దహనం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎస్సీ వర్గీకరణ (SC classification ) కూలల వారీగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లతో మాలలోని మాలలకు తీరని నష్టం జరిగే అవకాశముందని అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల కమిటీ అధ్యక్షులు సోన్ కాంబ్లే మనోహర్, ప్రధానకార్యదర్శి కామ్ రాజ్ వాగ్మారే అన్నారు. ఎస్సీలో ఉపకులాలకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యానంద్, దిలిప్ మోరే, రాజ్ వర్ధన్, శివాజీ, ఉత్తమ్, అతిష్ , దత్తా, సందీప్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలను దహనం చేశారు.