బజార్ హత్నూర్: మండలంలోని మారుమూల తండాల్లో త్వరలో బీటీ రోడ్లు వేయిస్తానని బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. గురువారం హర్కయి, భీమ్లానాయక్ తండాలో ఆయన పర్యటించారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన సమస్య అయిన గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లను (BT Roads) త్వరలోనే మంజూరు చేస్తామని అన్నారు.
ఈ సందర్భంగా గ్రామీణ యువతకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. అక్కడే ఉన్న దివ్యాంగులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కన్వీనర్ రాజారాం, నెడ్‌క్యాప్ మాజీ సభ్యుడు చిలుకూరి భూమయ్య, డుబ్బుల చంద్రశేఖర్, సాయన్న, సోము రాము, శరత్ కృష్ణ, రమణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.