ఇవాళ గ్రామ గ్రామానా.. రైతు బంధు పడలేదని రైతులు తిట్టుకుంటున్నరు. ఎవ్వడన్న నాట్లు వేసేప్పుడే రైతుబంధు వేస్తడు కానీ రేవంత్‌రెడ్డి మాత్రం ఓట్లు వేసేటప్పుడు వేస్తున్నడు. నాట్లప్పుడు కాదంట.. ఓట్లప్పుడే యాదికి వస్తదంట. ఇజ్జతి కూడా లేదు. నాట్లప్పుడు వేస్తే పైసలు పనికివస్తయ్. కానీ ఇవాళ పురుగుల మందు కొనుక్కునే పరిస్థితి వచ్చింది రైతులకు. పంట నష్టపాయే.. ఆగమాగమయైపాయే. తెలంగాణలో మళ్లా ఆత్మహత్యలు మొదలైనయ్. అందుకే దయచేసి చెప్తున్నా.. మంచిగ ఉన్నప్పుడు మనషుల విలువ తెల్వదు. అప్పుడప్పుడు గాడిదలను చూస్తనే గుర్రాల విలువ తెలుస్తది. అప్పుడప్పుడు చీకట్లను చూస్తనే.. వెలుగు విలువ తెలుస్తది. అందుకే చెప్తున్నా.. దయచేసి ఆగం కాకండి.. – కేటీఆర్
మంచిర్యాల, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే.. మొన్ననే పెద్దలు కేసీఆర్ మంచిర్యాలకు వచ్చినప్పుడు చెప్పారు. భూగర్భగని కార్మికుడికి.. ఆగర్భ శ్రీమంతుడికి మధ్య పోటీ నడుస్తున్నది. ఈశ్వరునికి.. కోటీశ్వరునికి మధ్య పోటీ జరుగుతున్నది. ఒక గుణవంతుడికి.. ఒక ధనవంతుడికి మధ్య పోటీ జరుగుతున్నది. మరి గెలిచేదెవ్వరు.. గెలవాల్సింది ఎవ్వరో.. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
దయచేసి ఆగం కావొద్దు. ఇదే చెన్నూర్ పట్టణానికి సరిగ్గా ఐదు నెలల కింద నవంబర్ 24న తమ్ముడు బాల్క సుమన్‌ను గెలిపించండి అని అడగడానికి వచ్చాను. కానీ ఏమైందో.. ఏమో నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి తారుమారైంది. కాంగ్రెసోళ్లు చూపెట్టిన అరచేతిలో వైకుంఠం.. అనే సినిమా చూసి చెన్నూర్ ప్రజలు మోసపోయారు.’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం చెన్నూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఏమన్నరు కాంగ్రెసోళ్లు.. ఫ్రీ బస్సు అన్నరు.. తు లం బంగారం ఇస్తా.. ఆడపిల్లలకు స్కూటీలు.. కోడళ్లకు రూ.2500, అత్తలుంటే(ముసలవ్వలకు) రూ.4000, అత్తలకు భర్తలుంటే(ముసలయ్యలకు) రూ.4000 పింఛన్ ఇస్తా అన్నరు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నరు. క్వింటాలు వరికి రూ.500 బోనస్ ఇస్తా అన్నరు. ఈ ఐదు నెలల్లో వీటిలో ఏదైనా అమలయ్యిందా చెప్పాలంటూ జనాలను కేటీఆర్ ప్రశ్నించారు. ఫ్రీ బస్సులో ఏమన్నా సుఖం ఉన్నదా.. ఫ్రీ బస్సు తుస్సు మందన్నారు. రేవంత్‌రెడ్డి రూ. రెండు లక్షల రుణ మాఫీ అన్నడు. డిసెంబర్ 9 నాడు ఎంబడే చేస్తా.
ఉరుకుండ్రి బ్యాంక్ నుంచి తెచ్చుకోండి.. నేను సంతకం పెట్టనే పెడితిని.. మీ ఖాతాలో పడనే ప డే.. అన్నడు. మరి పడ్డయా పైసలు.. పడ్డయా రెం డు లక్షలు.. రైతన్నలు, రైతు బిడ్డలు ఆలోచించాలన్నారు. మరి చెన్నూర్‌లో ఉన్న కోటీశ్వరుడన్న ఇయ్యలేదా రెండు లక్షలు. ఆయన జేబు దులిపితే పడుతయ్ రెండు లక్షలు.. కానీ వేస్తలేరన్నారు. అ యినా మళ్లా వాళ్లకే ఓటు వేద్దామా.. మళ్లా మొం డి చేయికే గుద్దుదామా.. మనకు మొండిచేయి ఇచ్చినంక కూడా తెలివి తెచ్చుకోవద్దా.. ఆలోచించి నిర్ణయం తీసుకోవలన్నారు. ముసలోళ్లకు రూ. నాలుగువేల పింఛన్ ఇస్తా అన్నరు.
కేసీఆర్ ఒక్కరికే ఇస్తండు.. నేను ఇద్దరికీ.. ముసలమ్మ-ముసలయ్యకు ఇస్తా.. కేసీఆర్ రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తా అన్నడు.. మరి పడ్డయా పింఛన్లు అంటే.. కొత్త పింఛన్లు ఇచ్చడు కాదు జనవరి నెల ముసలోళ్ల పింఛన్లు ఎగ్గొట్టి.. వాళ్ల కడుపుకొట్టినోడు రేవంత్‌రెడ్డి అంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చినంక తెలంగాణలో లక్షన్నర పెళ్లిళ్లు అయ్యాయని, ఈ లెక్కన రేవంత్‌రెడ్డి లక్షన్నర తులాల బంగారం మా ఆడబిడ్డలందరికీ బాకీ ఉన్నాడు. నిన్ను నమ్మి ఓట్లు వేసిండ్రు.. మీరు చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మి ఓట్లు వేసినోళ్లందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇక్కడికి వచ్చినోళ్లందరూ నిజాయితీగా సమాధా నం చెప్పండి. ఐదు నెలల కిందట కేసీఆర్ ప్రభు త్వం ఉండే.. అప్పుడే బాగుండే అనుకున్నోళ్లంద రూ చేతులు ఎత్తాలంటూ కేటీఆర్ అడగ్గానే.. వచ్చి న జనం మొత్తం చేతులు ఎత్తారు. బరాబరా ఈ ముచ్చట.. పక్కానా.. ఏం అనుమానం లేదా.. అ ని ప్రశ్నించగా.. పక్కాగా చెప్తున్నామన్నారు. అయి తే మీరంతా చేయాల్సింది ఒక్కటే పని.. 13న జరిగే ఎన్నికల్లో రెండో నంబర్ మీద ఓటేయాలని పిలుపునిచ్చారు. మొత్తం తెలంగాణలో పది పన్నెండు సీట్లు ఇయ్యండి. ఆరు నెలల్లో తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందన్నారు.
ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్‌కే ఎక్కువ పవర్ ఉంటుందన్నారు. ఇవాళ పోలీసోళ్ల దగ్గర బులెట్లు ఉండొచ్చు. కానీ, మీ దగ్గర బులెట్ కంటే పదునైన ఆయుధం బ్యాలెట్ ఉందన్నారు. పెద్దపెద్ద కోటీశ్వరులను కూడా కొట్టేందుకు ఒక్కటే ఆయుధం ఓటు అని.. ఆ ఓటుతోని వేటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఎవ్వరైతే మిమ్ములను మోసం చేసిండ్రో.. ఎవ్వలైతే అడ్డగోలు కార్యక్రమాలు చేస్తున్నరో వాళ్లకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ సూచించారు.
ఇందకా నేను ఇక్కడికి వస్తుంటే సుమన్ చెప్తున్న డు.. అన్న నా మీద కోపంతో నేను మంజూరు చేయించిన లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును క్యాన్సల్ చేయించిండు అని బాల్క సుమన్ చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. దీనికి నేను ఏమంటున్న అంటే.. నువ్వు(వివేక్) గెలిచినవ్ సరే.. గెలిచినంక ప్రజల మనసు గెలవాలి కదా.. గెలవాలంటే ఏం చేయాలే.. తమ్ము డు లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్ తీసుకువస్తే నీకు చేతనైతే, నీకు దమ్ముంటే దాన్ని పెంచు.
రెండు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రయత్నం చేయాలన్నారు. రెండు పంటలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్ ఉంటే.. మూడు పంటలకు నీళ్లిచ్చేలా చేయమని సూచించారు. చెన్నూర్, మందమర్రి మున్సిపాలిటీలకు నేను ము న్సిపల్ మంత్రిగా పైసలు ఇచ్చినా.. నీకు దమ్ముంటే నేను రూ.50 కోట్లు ఇస్తే.. నువ్వు రూ.150 కో ట్లు తీసుకురా.. ప్రజల మనసు గెలుచుకుంటే గట్ల గెలుచుకోవాలే.. రాజకీయం అంటే అదే కోరుకుంటరు ప్రజలు. రూపాయి ఎక్కువ పని చేయాలే.. అందుబాటులో ఉండాలే.. కష్ట.. సుఖాల్లో తోడుండాలే అనుకుంటున్నరు. కానీ ఇవాళ గెలిచినోళ్లకు ఆ సోయి లేదంటూ మండిపడ్డారు.
ఎందుకు వేయాలే బీజేపీ వాళ్లకు ఓటు అంటే గుడి కట్టినం అని చెప్తున్నారు.. మరి కేసీఆర్ కట్టలేదా గుడి.. యాదాద్రిలో బ్రహ్మాండమైన గుడి కట్టలేదా చెప్పాలని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఒ క్క యాదగరి గుట్టనే కాదు బ్రహ్మాండంగా నీళ్లు తీ సుకువచ్చేందుకు చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మంజూ రు చేసిండు. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టు, పాలమూ రు రంగారెడ్డిలాంటి ప్రాజెక్టు కట్టిండు.. ఎర్రటి ఎండల్లో చెరువులను మత్తడి దునికిచ్చిండు. గసొంటి కేసీఆర్‌ను పోగొట్టుకొని.. పదేళ్లలో బుడ్డ పైసా పని చేయని మోదీకి ఎందుకు ఓటు వేయా లో ఆలోచించాలన్నారు.
అన్నీ పిరం చేసినోడే మోదీ అని.. పప్పు, ఉప్పు, నూనె, సామాన్యుడు తినే కూరగాయలన్నీ పిరమైనయంటే దానికి కా రణం ఒకే ఒక్కడు మోదీ అన్నారు. కాంగ్రెస్ చేతి గుర్తోడు గెలిచినా.. బీజేపీ పువ్వు గుర్తోడు గెలిచినా.. సింగరేణిని అదానీకి అమ్మేయడం ఖాయమన్నారు. సింగరేణి ప్రవేట్ పరం కావద్దు అంటే ఈశ్వర్ గెలవాలన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బా గుండే అనుకునే వాళ్లంతా ఈశ్వర్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొన్నారు.
మా తమ్ముడు సుమన్ రేషం ఉన్నోడు. దమ్ము ఉన్నోడు. నేను ఉత్తగనే అనలే ఈ మాట. రేవంత్‌రెడ్డి అనేటోడు చిల్లర గాడు. ముఖ్యమంత్రే కావచ్చు కానీ చిల్లర గాడు. గా చిల్లరగాడు కేసీఆర్‌నుద్దేశించి ఒక చిల్లర మాట మాట్లాడిండు. నేను కేసీఆర్ కొడుకునే కావచ్చు. కానీ నా తమ్ముడు ఎంత రేషం ఉన్నోడంటే చెప్పు తీసి ముఖ్యమంత్రికి చూపెట్టిండు. చెప్పుతో కొడుతా చెత్తనా కొడుకా అని చెప్పిండు.
అదీ దమ్మున్న నాయకుడు అంటే. పదవి ఉంటది కావచ్చు. పీకుతది కావచ్చు. బతికేదే కొన్ని రోజులు. అందరం చస్తాం. కానీ బతికినన్ని రోజులు రేషంతోని బతకాలి అని చూపెట్టిన పులి బిడ్డ మా తమ్ముడు సుమన్. ఆయనకు హదయ పూర్వకంగా ధన్యవాదాలు. ఇంత మంచి నాయకుడిని కోల్పోయారు. మరి ఇప్పుడు ఈశ్వర్ అన్నను గెలిపిస్తే రేపు చెన్నూర్ ఎమ్మెల్యే లెక్క చేస్తడు
– కేటీఆర్