చెన్నూర్, డిసెంబర్ 2: బీఆర్ఎస్ చేపడుతున్న గురుకులాల బాటపై సర్కారుకు భయమెందుకని బీఆర్ఎస్వీ నాయకులు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు సోమవారం చెన్నూర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు, గురుకుల పాఠశాల సిబ్బంది అడ్డుకోవడంపై మండిపడ్డారు.
మైనార్టీ గురుకుల పాఠశాల ముందు ఆందోళనకు దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు నాయబ్ మాట్లాడుతూ వసతి గృహాల్లోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులు అడుగడుగునా తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొప్పుల రవీందర్, నాయిని సతీశ్, పాశం ఆశీశ్, చినాల ప్రశాంత్‌రెడ్డి, కమటం మనోహార్, దుర్గం తిరుపతి, తిరుపతి సురేశ్, గడ్డం విష్ణు, సంతోశ్, మహేందర్ , తదితరులు పాల్గొన్నారు.