పెంబి, జూన్ 2 : ఆదివాసీ హక్కుల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఆదివాసీ గ్రామాలపై అటవీ శాఖ అధికారులు విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో తొమ్మిది రోజులుగా చేపడుతున్న నిరవధిక నిరసన దీక్షకు జాన్సన్ నాయక్ మద్దతు ప్రకటించారు.
నిరసన దీక్ష శిబిరాన్ని మంగళవారం సందర్శంచి, వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరవధిక దీక్షపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలపై గిరిజనులు జాన్సన్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు నరేందర్‌రెడ్డి, బైరెడ్డి గంగారెడ్డి, భుక్యా గోవింద్, పూర్ణచందర్ గౌడ్, కున్సోత్ విలాస్, మహేందర్, గాండ్ల శంకర్, మల్లెష్, చింతకింది శేఖర్ పాల్గొన్నారు.