భైంసా, ఏప్రిల్, 11 : ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ముథోల్ నియోజకవర్గం నుంచి పె ద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చేలా బీఆర్ఎస్ నాయకులు ర మాదేవి, విలాస్ గాదేవార్, డా. కిరణ్ కొమ్రేవా ర్, లోలం శ్యాంసుందర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే భైంసా పట్టణంతో పాటు మండలంలో సభ విజయవంతం చేయాలని కోరుతూ వాల్ రైటింగ్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇం దులో భాగంగా శుక్రవారం పట్టణంలో ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు కిరణ్ కొమ్రేవార్ స్వయంగా ‘కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి’ గోడపై రాసి ప్రచారం చేపట్టారు.
రజతోత్సవ సభ విజయవంతం చేయడంపై శుక్రవారం భైంసా పట్టణంలోని ఎన్ఆర్ గార్డెన్లో నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. సభకు సంబంధించిన పోస్టర్‌ను ముథోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు ర మాదేవి, విలాస్ గాదేవార్, కిరణ్ కొమ్రేవార్, లోలం శ్యాంసుందర్, నాయకులు ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు దశరథ్, దత్తు, శ్యామ్, రాజేశ్, పోశెట్టి, అజీజ్ ఖురేషీ, వాసే, నాయకులున్నారు.
లోకేశ్వరం, ఏప్రిల్, 11 : బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ము థోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ పిలుపునిచ్చారు. శుక్రవా రం లోకేశ్వరంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ మం డల సోషల్ మీడి యా కన్వీనర్ బండి ప్ర శాంత్, నాయకులు పాల గంగాధర్, ధర్మోరా ప్రకాశ్, భోజారెడ్డి, సుధాకర్, నగర్ మాజీ ఉప స ర్పంచ్ ముసఫ, హవర్గ భోజ న్న, మగ్గిడి రాజు, మాజీ ఎంపీటీసీ బందు, ఎస్టీ సెల్ కన్వీనర్ రాజుర భోజన్న, ఆనందరావు, బాబన్న, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 11 ( నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కొండ గణేశ్, ధమ్మపాల్ కోరారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని సుభాష్‌నగర్, కొలిపూరా, పిట్టల్‌వాడ, అనుకుంట ప్రాంతాల్లో వాల్ రైటింగ్స్ ద్వారా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో దేవిదాస్, మౌర్య, సురేందర్, వసంత్, అశోక్, విఠల్, వినోద్, మహేశ్ పాల్గొన్నారు.