‘నేను మీ సేవకుడిని. మేలు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా. సంపూర్ణ మద్దతు తెలిపి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా..’ అని ఖానాపూర్ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కాగ్నే ఫంక్షన్ హాల్లో పార్టీ మండల నాయకులతోపాటు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, హ్యాట్రిక్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. అందరం కలిసి పని చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపాలని స్పష్టం చేశారు. కాగా.. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్‌ను జాన్సన్ నాయక్ కలిశారు. ఆశీస్సులు కావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్లో చేరగా.. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
– ఇంద్రవెల్లి, ఆగస్టు 24
ఇంద్రవెల్లి, అగస్టు 24 : ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కాగ్నే ఫంక్షన్ హాల్లో పార్టీ మండల నాయకులతోపాటు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధితోపాటు ప్రజలకు సేవలందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ గుర్తించి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారన్నారు. అందరూ సహకరిస్తే అభివృద్ధి సాధ్యమని.. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తలదించుకునే పరిస్థితి రానివ్వకుండా పని చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులు తేవడానికి కృషి చేస్తానన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, హ్యాట్రిక్ సాధిస్తారని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. తను అమెరికాలో వ్యాపారం చేసేదని, ఇక్కడ కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారూతి డోంగ్రే, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, బీఆర్ఎస్ పార్టీ మండల కో-ఆర్డినేటర్ షేక్ సుఫియాన్, సర్పంచ్‌లు జాదవ్ లఖన్సింగ్, కినక జుగాదిరావు, రాంచందర్, లక్ష్మణ్, కొరెంగ గంధారి, విజయ, పారవ్తీబాయి, సోయం రంభాబాయి, కుసుమబాయి, రాథోడ్ సేవంతబాయి, ఉప సర్పంచ్ రాథోడ్ రాధిక, ఎంపీటీసీలు కోవ రాజేశ్వర్, కోరెంగ సులోచన, కుంర జంగుబయి, ఆశాబాయి, నాయకులు దేవ్‌పూజే మారుతి, సాయినాథ్, కనక హన్మంత్‌రావు, సుంకట్‌రావు, రాథోడ్ మోహన్ నాయక్, సుంగు పటేల్, రామారావ్, ధరణి ధన్‌రాజ్, శ్రీనివాస్, ప్రేమ్‌సింగ్ పాల్గొన్నారు.