నేతల పుట్టిల్లు బీఆర్ఎస్
రాజకీయ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా బీఆర్ఎస్ పార్టీ విరాజిల్లుతున్నది. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీలో ఆది నుంచి కొత్త నాయకత్వం పుట్టుకొస్తూనే ఉన్నది. ఉద్యమ సమయంలో సమైక్య పాలకులు ఎన్ని కుట్రలు చేసినా, ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులు చేసినా ప్రత్యామ్నాయం సృష్టించుకుని నిలదొక్కుకున్న పార్టీగా గుర్తింపు ఉన్నది.
- రాజకీయ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా గులాబీ పార్టీ
- వేల సంఖ్యతో ద్వితీయ.. లక్షల సంఖ్యలో తృతీయ స్థాయి నాయకత్వం
- ఉమ్మడి జిల్లాలో అన్ని స్థాయిల్లోనూ ఎదిగిన నేతలు అనేకం
- కొందరు పార్టీ మారితే నష్టం లేదు.. ప్రత్యామ్నాయానికి కొదవ లేదు..
రాజకీయ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా బీఆర్ఎస్ పార్టీ విరాజిల్లుతున్నది. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీలో ఆది నుంచి కొత్త నాయకత్వం పుట్టుకొస్తూనే ఉన్నది. ఉద్యమ సమయంలో సమైక్య పాలకులు ఎన్ని కుట్రలు చేసినా, ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులు చేసినా ప్రత్యామ్నాయం సృష్టించుకుని నిలదొక్కుకున్న పార్టీగా గుర్తింపు ఉన్నది. పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి దాకా ఎదురుదెబ్బలు తగిలినా ముందుకు వెళ్లడం తప్పా వెనక్కి చూసుకోవడం బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు అలవాటు లేదు.
రాష్ట్రం సాధించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందరో నాయకులు చేరారు. పార్టీ అవసరాలు, ఆ నాయకుల అనుభవంతో పార్టీకి ఉన్న అవసరాన్ని గుర్తెరిగి కేసీఆర్ అందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు ఎందరో ఉన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల నాయకుల నుంచి వచ్చిన వారెందరికో గులాబీ పార్టీ అవకాశాలు కల్పించింది. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎంతో మంది నాయకులను తయారు చేసింది బీఆర్ఎస్.
– మంచిర్యాల, జూన్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిప్పు కనికల్లాంటి నాయకులు ఎందరో..
తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటాన్ని గుర్తుంచుకుని విద్యార్థి నాయకుడైన బాల్క సుమన్‌కు సీఎం కేసీఆర్ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన ఆ యువ కిరణానికి రాజకీయ దిశానిర్దేశం చేశాడు. పెద్దపల్లి ఎంపీగా, చెన్నూర్ ఎమ్మెల్యేగా రెండు సార్లు అవకాశాలు ఇచ్చి గెలిపించుకున్నారు. బాల్క సుమన్‌ను వెన్నంటే ఉంచుకుని కాపాడుకున్నారు. ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి దళితనాయకుడికి పెద్దపీట వేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కూడా 2014 సంవత్సరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించింది బీఆర్ఎస్ పార్టీయే. పార్టీలో చేరిన తర్వాతనే ఎమ్మెల్యేగా గెలుపొందారు.
బోథ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ జాదవ్ తన ప్రస్తానాన్ని బీఆర్ఎస్ పార్టీలోనే ప్రారంభించారు. జడ్పీటీసీగా ఉన్న యువనాయకుడి కష్టాన్ని గుర్తించి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి దగ్గరుండి గెలిపించుకున్నారు. ఖానాపూర్ నుంచి మరో యువ నాయకుడు జాన్సన్ నాయక్‌ను వెలుగులోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. విదేశాల్లో వ్యాపారాలు కలిగిన ఆయనలోకి సేవ భావాన్ని గుర్తించి రాజకీయాల్లోకి ఆహ్వానించింది. ఎన్నో ఏండ్లుగా వెనుకబడిన మారుమూల ప్రాంతంగా, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చింది. తృటిలో ఓటమి పాలైనా.. ఖానాపూర్ నియోజకవర్గానికి మాత్రం ఓ మంచి నాయకుడిని అందించింది.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి బీఆర్ఎస్ పార్టీనే పుట్టినిల్లు. ఆమె ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్‌పర్సన్‌గా, రెండోసారి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలుపొందారు. ఆదివాసీ బిడ్డకు రాజకీయ ఓనమాలు నేర్పించి జిల్లాలోనే తిరుగులేని నాయకురాలిగా మలిచింది. ఉద్యమ కాలంలో వెన్నంటి నడిచిన రేణికుంట్ల ప్రవీణ్‌కు ఉద్యమ నాయకుడి హోదాలో పదవులు కట్టబెట్టింది. వీరితోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు, వందలాది మందిని బీఆర్ఎస్ తయారు చేసింది. ఎన్నిక ఏదైనా టికెట్ విషయానికి వచ్చే సరికి రెండు, మూడు ఆప్షన్లు కలిగి ఉన్న ఏకైక రాజకీయ పార్టీగా తెలంగాణలో తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరచుకున్నది.
పార్టీలు మారేటోళ్లతో నష్టం లేదు..
అధికార దాహం, కనీస నైతిక విలువలు, రాజకీయ చైతన్యం, జ నం ఏం అనుకుంటారో అనే ఆలోచన, ప్రజాస్వామ్యం అంటే గౌ రవం లేని కొందరు నాయకులకు రాజకీయ భిక్షపెట్టి, సీనియార్టీని గౌరవించి పదవులు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన తల్లి వంటి పార్టీని వదిలి అధికార పార్టీలో చేరేవారితో బీఆర్ఎస్కు వచ్చే నష్టం ఏం లేదన్నది సుస్పష్టంగా గోచరిస్తున్నది.
ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరే కొందరు నాయకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ అధినాయకత్వం ధీమాగా చెప్పడం వెనక ఓ కారణం ఉంది. పదవులు, అధికారం కోసం పార్టీ మారే వారు పోయినా.. ఉద్యమకాలం నుంచి పార్టీనే నమ్ముకున్న నాయకులు ఇంకా స్థిరంగా బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా పదుల మంది నాయకులు బీఆర్ఎస్లో ఉన్నారు. నాయకత్వం లేదని బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఉద్దేశపూర్వకంగా రాజకీయాలే చేసే వారికి సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్లోని నాయకత్వం సిద్ధంగా ఉన్నది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

