బాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : విదేశాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలు(ఓవర్సీస్ స్కాలర్షిప్) అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తర సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు.
కేసీఆర్ ప్రభుత్వం విదేశాల్లో ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ను ప్రవేశ పెట్టిందన్నారు. ప్రస్తుతం స్కాలర్షిప్ అందకపోవడంతో వారి తల్లిదండ్రులు డబ్బులు బాకీలు చేస్తూ వడ్డీలు కడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు స్కాలర్షిప్ అందడం లేదని, వాటిని కూడా త్వరగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.