తాంసి, అక్టోబర్ 21 : ప్రజా సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో విపక్ష పార్టీల్లో వణుకు మొదలైందని జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం జామిడి గ్రామంలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పనులు ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసి బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు స్వప్నారత్నప్రకాశ్, కుంట సరిత- కేశవ్ రెడ్డి, మునేశ్వర్ భరత్, బీఆర్ఎస్ నాయకులు రవికాంత్ రెడ్డి, శ్రీనివాస్, పరమేశ్, అరుణ్‌కుమార్, సిరిగిరి దేవేందర్, వైస్‌ఎంపీపీ ముచ్చ రేఖారఘు, ఉత్తమ్, జామిడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.