BRS Leaders Arrest | బాసరలో సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
BRS Leaders Arrest | నిర్మల్ జిల్లా బాసర ఆలయం లో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.
కుభీర్ : నిర్మల్ జిల్లా బాసర ఆలయం ( Basara Temple ) లో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) సోమవారం శంకుస్థాపన చేశారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను ( BRS Leaders ) పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
కుభీర్ మండల కేంద్రం ఉద్యమ నాయకుడు పుప్పాల పీరాజీ తోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, మాజీ వైస్ ఎంపీపీ మోహియోద్దీన్, మాజీ సర్పంచ్ జీ బాబు, దత్తాత్రిని సోమవారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు, 420 హామీలను బుట్ట దాఖలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ప్రజల్లో తిరుగుతున్న సీఎంను ప్రజలు ప్రశ్నించకుండా ముందస్తు అరెస్టులకు పాల్పడి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం మక్క రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేక విలవిల్లాడుతున్నారని వెంటనే మక్కా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన, ముఖ్యంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

