నల్లబెల్లి, ఆగస్టు 8 : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలకేంద్రానికి నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రానున్నారు. ఉద్యమ సహచరుడు, బీఆర్ఎస్ పార్టీ స్థాపన నుంచి తనకు నమ్మిన బంటుగా ఉంటూ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న కేసీఆర్ పెద్ది కుటుంబ సభ్యులను కలవనున్నారు.
పెద్ది భార్య పెద్ది స్వప్నతోపాటు కొడుకు పెద్ది నిరంజన్‌రెడ్డి, కూతురు మల్లమ్మతోపాటు తల్లి అమృతమ్మ, పెద్ది సోదరులు, ఆడబిడ్డలను పరామర్శించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పార్టీ నేతలు, స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.