అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం
మీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో రైతాంగాన్ని నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు.
-
బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు ప్రాధాన్యం
-
నిర్మల్ రైతు గర్జన సభకు తరలిన నాయకులు
మీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో రైతాంగాన్ని నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు.అబద్ధపు హా నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం రైతుల పక్షాన తలపెట్టిన రైతు గర్జన సభకు జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్న ఈ సభలో పాల్గొనేందుకు ప్రత్యేక వాహనాల్లో ఉత్సాహంగా బయల్దేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేసీఆర్ పాలనలో బీడు భూములు పంటలతో కలకలలాడాయని, రైతులు సంతోషంగా రెండు పంటలు పండించుకున్నారని పేర్కొన్నారు. ఈ రైతు గర్జన సభతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి రేపో ఎల్లుండో రైతు భరోసా వేస్తుందని విమర్శించారు.
మంచిర్యాల టౌన్, నవంబర్ 11 : మంచిర్యాల నుంచి ఫిలిం డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పుస్కూరు రాంమోహన్‌రావు సమక్షంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేశ్, ఐసీడీఎస్ మాజీ ఆర్గనైజర్ అత్తి సరోజ, నాయకులు మాధవరపు శ్రీలత రామారావు, ఎడ్ల శంకర్, తాజుద్దీన్, బండి పద్మ, గంగులు, ప్యాట జనార్దన్, మహమ్మద్ రఫీ, షకీల్, బోర్లకుంట రాజయ్య, ఉప్పెర రవీందర్, మహేశ్, మహేందర్, తోటి ఉమాకాంత్, ఈసారపు శ్రీనివాస్, గుమ్మడి వెంకటేశ్వర్లు, కర్రె ఉమ, బొమ్మెన మహేశ్ తదితరులు తరలివెళ్లారు.
చెన్నూర్ నుంచి
చెన్నూర్ రూరల్, నవంబర్ 11 : బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు చెన్నూర్ మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. వారిలో బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్ పొన్నం మల్లేశ్ం గౌడ్, మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి, కిష్టంపేట మాజీ సర్పంచ్ బర్ర రాకేశ్ గౌడ్, నాయకులు ప్రవీన్ నాయక్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జన్నారం నుంచి..
జన్నారం, నవంబర్ 11 : ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు జన్నారం మండలం నుంచి 29 గ్రామాల్లోని పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వారిలో ఫజల్‌ఖాన్, శ్రీనివాస్‌గౌడ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

భీమారం నుంచి..
భీమారం, నవంబర్ 11 : భీమారం మం డలం నుంచి పార్టీ మండలాధ్యక్షుడు కల గూర రాజ్‌కుమార్, ధర్మారం సర్పంచ్ దాసరి మణిదీపక్, చింతం తిరుపతి, కలగూర రమే శ్, విశాల్, భూక్యా రాజేశ్ నాయక్, నవీన్ నాయక్, కిరణ్ తదితరులు తరలి వెళ్లారు.
కోటపల్లి నుంచి..
కోటపల్లి, నవంబర్ 11 : కోటపల్లి మం డలం నుంచి పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి ఆసంపల్లి సంపత్ కుమార్‌తోపాటు, నాయ కులు గారె రాజు, తిరుపతి, అజయ్ తరలి వెళ్లారు. కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపించారు.
గుండెల నిండా కేసీఆర్..
దండేపల్లి, నవంబర్ 11 : పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు పదవులు, ప్రయోజనాలు అవసరంలేదని నిరుపిస్తున్నాడు దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన తీగల చంద్రయ్య. బీఆర్ఎస్ నిర్వహించే సభలు, సమావేశాలకు సొంత ఖర్చులతో హాజరవుతూ పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు. ఎంత దూరమైన తనకున్న ఆటోలో ప్రయాణిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న చంద్రయ్య తీరు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నది. నిర్మల్‌లో జరిగే కేటీఆర్ సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న చంద్రయ్యను నమస్తే.. పలుకరించగా, మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ వద్ద డ్రైవర్‌గా పనిచేసినప్పటి నుంచి కేసీఆర్ అన్నా..
బీఆర్ఎస్ అన్నా ఎంతో అభిమానమని, పార్టీ మీటింగ్ ఎక్కడున్నా ఆటోలోనే సొంత ఖర్చులతో వెళ్తానని చెప్పుకొచ్చాడు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఎంతగానో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ఆటోలో కేసీఆర్ ఫొటోలు, జై తెలంగాణ నినాదాలతో ప్రత్యేకతను చాటుకుంటున్న చంద్రయ్యను పలువురు అభినందిస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

