ఓ సినిమా హీరో కథ
‘35 చిన్న కథ కాదు’ చిత్రం ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు యువ హీరో రాచకొండ విశ్వదేవ్. ఆయన తాజా చిత్రం ‘డార్క్ చాక్లెట్' ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘35 చిన్న కథ కాదు’ చిత్రం ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు యువ హీరో రాచకొండ విశ్వదేవ్. ఆయన తాజా చిత్రం ‘డార్క్ చాక్లెట్’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. డార్క్ కామెడీ, సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి నిర్మాత. బుధవారం చిత్ర హీరో రాచకొండ విశ్వదేవ్ విలేకరులతో ముచ్చటించారు. సినీరంగం నేపథ్యంలో అనూహ్య మలుపులతో ఈ కథ సాగుతుందని తెలిపారు. ‘ఇందులో నా పాత్ర పేరు యజ్ఞ. తను సినిమా హీరోగా వరుసగా మూడు హిట్స్ కొట్టి, ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతుంటాడు.
ఫెయిల్యూర్స్ కారణంగా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంటాడు. ఫిల్మ్ ఛాంబర్ కూడా అతన్ని బ్యాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అన్నీ తానై ఓ సినిమా తీద్దామనుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగిందన్నది కథలో ఆసక్తికరం’ అన్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఈ తరహా కథాంశం రాలేదని, డార్క్ కామెడీ, సైకలాజికల్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పారు. మాటలతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసేలా ఈ సినిమాలో కొత్త ప్రయోగం చేశామని, అది అద్భుతంగా వచ్చిందని తెలిపారు. తన తాతగారైన ప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి సాహిత్యాన్ని కొంత వరకు చదివానని, తనకు నృత్యం, సంగీతంపై ఆసక్తి ఎక్కువని రాచకొండ విశ్వదేవ్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

