ఐపీఎల్ జట్ల పెంపు ఇప్పట్లో లేదు: సైకియా
పెంచుతారంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది. 2028 నాటికి ఐపీఎల్‌ను 12 జట్ల లీగ్‌గా మార్చే ఆలోచనపై బోర్డులో ఎలాంటి చర్చలూ జరగలేదని కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఐపీఎల్లో జట్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచుతారంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది. 2028 నాటికి ఐపీఎల్‌ను 12 జట్ల లీగ్‌గా మార్చే ఆలోచనపై బోర్డులో ఎలాంటి చర్చలూ జరగలేదని కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ప్రస్తుతం బోర్డు దృష్టి అంతా వచ్చే ఏడాది మార్చిలో మొదలయ్యే 20వ ఎడిషన్ ఐపీఎల్ ను విజయవంతంగా నిర్వహించడంపైనే ఉందని, జట్ల పెంపు కథనాలు ఊహాగానాలు మాత్రమేనని తేల్చి చెప్పారు.
అలాగే డిసెంబర్ 16న జరగనున్న మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీల శాలరీ పర్స్‌ను రూ. 125 కోట్ల నుంచి రూ. 150 కోట్లకు పెంచుతున్నారనే వార్తల్లో కూడా నిజం లేదని సైకియా వెల్లడించారు. ప్రస్తుత ఐపీఎల్ సైకిల్లో ఇది చివరి ఏడాది అని, వచ్చే ఏడాది జరగబోయే మెగా వేలానికి ముందే పర్స్ పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

