క్వాంటం టెక్నాలజీపై మూడు రోజుల వర్‌షాప్
భవిష్యత్తు సాంకేతిక రంగంలో కీలక మార్పులకు వేదిక కానున్న క్వాంటం టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎన్ఐఈఎల్ఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల ప్రత్యేక వర్‌షాప్ జరుగుతున్నది. నవంబర్ 11 నుంచి 13 వరకు ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ క్వాంటం కమ్యూనికేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ క్వాంటం టెక్నాలజీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
- 200 మంది విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ
- ఎన్ఐఈఎల్ఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 ( నమస్తే తెలంగాణ ): భవిష్యత్తు సాంకేతిక రంగంలో కీలక మార్పులకు వేదిక కానున్న క్వాంటం టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎన్ఐఈఎల్ఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల ప్రత్యేక వర్‌షాప్ జరుగుతున్నది. నవంబర్ 11 నుంచి 13 వరకు ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ క్వాంటం కమ్యూనికేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ క్వాంటం టెక్నాలజీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని నీలిట్ హైదరాబాద్ ఈ వర్‌షాప్ నిర్వహిస్తున్నది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడం ఈ వర్‌షాప్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
క్వాంటం మెకానిక్స్ ప్రాథమిక సూత్రాలు, క్వాంటం స్టేట్స్, సూపర్ పొజిషన్, ఎంటాంగిల్‌మెంట్, క్వాంటం అల్గారిథమ్స్, క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ , క్వాంటం టెలిపోర్టేషన్, క్వాంటం ఆప్టిక్స్, పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీ, క్వాంటం రాండమ్ నంబర్ జనరేషన్ తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు. సిద్ధాంతపరమైన బోధనకే పరిమితం కాకుండా ప్రయోగశాలల్లో ప్రత్యక్ష శిక్షణ, సాంకేతిక ప్రదర్శనలు, నిపుణులతో ముఖాముఖి చర్చలు, పోస్టర్ ప్రజెంటేషన్లు కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఐఐటీఎం సీడీవోటీ సమ్గ్న్యా టెక్నాలజీస్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ రవీంద్ర బార్లింగే, నీలిట్ కాలికట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జయరాజ్ యు కిదవ్, నీలిట్ హైదరాబాద్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ డాక్టర్ లక్ష్మణ్ కొర్రా తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

