దెబ్బతిన్న పంటల సర్వేలో సర్కార్ విఫలం
మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను సర్వే చేయడంలో ప్రభుత్వం, మంత్రులు విఫలమయ్యారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధ్వజమెత్తారు.
- ఎకరానికి రూ.50 వేల పంట నష్ట పరిహారం అందించాలి
- మాజీ ఎమ్మెల్యే సండ్ర డిమాండ్
- దెబ్బతిన్న పంటల పరిశీలన
పెనుబల్లి, నవంబర్ 11 : మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను సర్వే చేయడంలో ప్రభుత్వం, మంత్రులు విఫలమయ్యారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధ్వజమెత్తారు. తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి, కొత్త ఎర్రబోయినపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. వరి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
వ్యవసాయ శాఖ పంట నష్టాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 34 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్తున్నా ఏ ప్రాతిపదికన అంచనా వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని, లేదంటే సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

