ఫేక్ కోర్టు ఆర్డర్లతో బెట్టింగ్ వెబ్సైట్ల మూత
129 చట్ట విరుద్ధ బెట్టింగ్ వెబ్సైట్లను మూసివేయించడానికి టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నకిలీ కోర్టు ఆర్డర్లను ఉపయోగించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ ప్రొవైడర్లకు జూలై 21న, సెప్టెంబర్ 2న ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాలకు రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ర్టాల హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలుగా పేర్కొంటూ కొన్ని పత్రాలను జత చేసిందని వివరించింది.
- రెండు ఫోర్జరీ ఆర్డర్లతో 129 వెబ్సైట్లకు షాక్
- కేంద్ర ప్రభుత్వం నిర్వాకం
- ఓ వార్తా సంస్థ పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ : 129 చట్ట విరుద్ధ బెట్టింగ్ వెబ్సైట్లను మూసివేయించడానికి టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నకిలీ కోర్టు ఆర్డర్లను ఉపయోగించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ ప్రొవైడర్లకు జూలై 21న, సెప్టెంబర్ 2న ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాలకు రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ర్టాల హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలుగా పేర్కొంటూ కొన్ని పత్రాలను జత చేసిందని వివరించింది. అయితే, ఆ కోర్టు ఆర్డర్స్ సంబంధిత హైకోర్టుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రికార్డులలో లేవని తెలిపింది. రాజస్థాన్ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ప్రశ్నించినపుడు, ఆ ఆర్డర్ మోసపూరితమైనదిగా కనిపిస్తున్నట్లు చెప్పారని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు ఈ ఫేక్ ఆర్డర్‌పై పోలీసులకు ఈ నెల 6న ఫిర్యాదు చేసినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. రాష్ట్ర సీనియర్ సైబర్ క్రైమ్ అధికారి ఘనశ్యామ్ యాదవ్ స్పందిస్తూ, ఈ ఆర్డర్ అలహాబాద్ హైకోర్టు ఇచ్చినది కాదని, ఫేక్ ఆర్డర్ అని చెప్పారని పేర్కొంది. ఈ ఫేక్ ఆర్డర్లను ఎలా సృష్టించారు? అనే విషయంపై స్పష్టత లేదని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

