బోథ్, అక్టోబర్ 15 : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సముచిత స్థానం కల్పించారని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మ్యానిఫెస్టో ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం బోథ్ బస్టాండ్‌లో బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రకటించిన మ్యానిఫెస్టోతో బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ 50 వేల మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చోడ(సిరికొండ), అక్టోబర్ 15 : మ్యానిఫెస్టోతో పాటు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జాన్సన్ నాయక్, బోథ్ నియోజకవర్గ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జాదవ్ అనిల్ బీ-ఫారాలు తీసుకున్న సందర్భంగా సిరికొండలో నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెడుతూ సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నర్మదాపెంటన్న, ఏక్బాల్, రోహిదాస్, బిక్కు, ఉత్తమ జవాన్ ఆనంద్‌రావ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సునీల్, నాయకులు ఎగిరిపెద్ద మల్లేశ్, గొర్ల రాజన్న, విజయ్, పెంటన్న, సూర్యవంశీ, ప్రభాకర్, మారుతి పాల్గొన్నారు.
ఇచ్చోడలో బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి మిఠాయిల పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు పాండు రంగ్, మండల మాజీ కన్వీనర్ మేరాజ్, సర్పంచ్ సునీత, మాజీ జడ్పీటీసీ కృష్ణ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీలు శివరెడ్డి, రమేశ్, విజయ్, లక్ష్మి, పాండు, మహేందర్ రెడ్డి, రవీందర్, సుభాష్, గణేశ్ నాయకులు సుభాష్ పాల్గొన్నారు.
నేరడిగొండ, అక్టోబర్ 15 : నేరడిగొండలోని సర్వీసు రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, వీడీసీ చైర్మన్ ఎలేటి దేవేందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ పెంట వెంకటరమణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లే నానక్‌సింగ్, ఉపసర్పంచ్ దేవేందర్‌రెడ్డి, మాజీజడ్పీటీసీ సయ్యద్ జహీర్, నాయకులు శంకర్, చంద్రశేఖర్‌యాదవ్, రాజేశ్వర్, లచ్చన్న, గులాబ్‌సింగ్, పండరి, సురేందర్, శ్రీకాంత్, నారాయణ, జాదవ్ గణేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, అక్టోబర్ 15 : బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా మండల కేంద్రంలోని నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నానం రమణ, సాయన్న , భూమన్న, రాజారాం, శ్రీనివాస్, మల్లేశ్, జనార్దన్, శరత్, ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, అక్టోబర్ 15 : గుడిహత్నూర్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్షాల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. మూడో సారి బోథ్ గడ్డపై గులాబీ జెండా ఎగుర వేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తోషం ఎంపీటీసీ శగీర్ఖాన్, మండల నాయకులు కరాడ్ బ్రహ్మానంద్, మాధవ్, గుణవంత్‌రావ్, వెంకట్రావ్, దేవన్న, రవినాయక్, గజానంద్ గిత్తె, ఖలీల్, రమేశ్, అలీంఖాన్, భూమన్న, సుధాకర్, జంగు, తదితరులు పాల్గొన్నారు.
తలమడుగు, అక్టోబర్ 15: మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, నాయకులు కేదారేశ్వర్ రెడ్డి, అభిరాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, జీవన్ రెడ్డి, అబ్దుల్లా, చంటి, సునీతా రెడ్డి, పల్లవి, రమాకాంత్ పాల్గొన్నారు.
భీంపూర్, అక్టోబర్ 15 : సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో సబ్బండ వర్గాల వారికి అండగా ఉందని జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ అన్నారు. కేసీఆర్ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా భీంపూర్‌లో నాయకులు, కార్యకర్తలు, రైతులు, యువకులతో కలిసి పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ బక్కి గోవర్ధన్ యాదవ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ అనిల్, షేక్ అఫ్రోజ్, ముకుంద సంతోష్ , జీ నరేందర్‌యాదవ్, నితిన్, రాథోడ్ ఉత్తమ్, జాదవ్ రవీందర్, కల్చాప్యాదవ్, ఆకటి నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాంసి, అక్టోబర్ 15: తాంసిలో బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ముచ్చ రేఖారఘు, సర్పంచ్‌లు సదానందం, అశోక్, జ్యోతి నర్సింగ్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, లక్ష్మణ్, మల్లయ్య, చంద్రయ్య, మహేందర్, నాగా రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అరుణ్‌కుమార్, ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.