జైనథ్, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం జైనథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గిమ్మ గ్రామంలో దత్త మందిరాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, ప్రాంగణంలో మొకలను నాటారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించిన నాయకుడే రాష్ట్ర అభివృద్ధికి వెలుగు బాటలు వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. మరోసారి కేసీఆర్ లాంటి నాయకుడి పాలన అందిపుచ్చుకునేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగారెడ్డి సంతోష్ రెడ్డి, ముకెర ప్రభాకర్ పురుషోత్తం, భోజన్న, కేశవ్ రమేశ్, గణేశ్ యాదవ్, కొండ్రు వెంకట్ రెడ్డి, కుంట హనుమాన్లు, కైపెల్లి రామయ్య, మహేందర్, రమేశ్ పాల్గొన్నారు.
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ
కాప్రి గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కమిటీ గ్రామ అధ్యక్షుడు రామన్న, నాయకులు బతుర్ వెంకటి, ఏనుగు నవీన్, బండి సతీశ్, నిమ్మల లింగారెడ్డి, కంది శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ విద్యార్థులు పాల్గొన్నారు.
హారతులిచ్చి.. శుభాకాంక్షలు తెలిపి..
ఇచ్చోడ, ఫిబ్రవరి 17 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంలో మహిళలు కేసీఆర్ చిత్రపటానికి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, మహిళలు పాల్గొన్నారు.
బేల, ఫిబ్రవరి 17 : కేసీఆర్ జన్మదినం సందర్భంగా మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొకలు నాటారు. అనంతరం కేక్ కట్ చేశారు. గురుద్వార్ ఆలయ కమిటీ సభ్యులకు అన్నదానం కోసం రూ.5 వేలు విరాళం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు సతీశ్ పవర్, నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న, జకుల మధుకర్, మాస్ తేజీరావ్, ప్రకాశ్పవర్, ఆకాశ్ గుండవార్, ఖోడే విపిన్, దయాకర్, బత్తుల సుదర్శన్, సుధాకర్, కొడపే అరుణ్ పాల్గొన్నారు.
రక్తదానం చేసిన బీఆర్ఎస్ నాయకులు
తాంసి, ఫిబ్రవరి 17 :ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నేరడిగొండ రక్తదాన శిబిరానికి బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేందర్, అశోక్, రఘు, రవికాంత్, నిమ్మల సురేశ్, రమణ, బత్తుల అడెల్లు, మాజీ సర్పంచ్ సాయిరి భగవాన్, లింగన్న, కంది రమేశ్, పవన్, కిశోర్, రమాకాంత్, ప్రభాకర్ పాల్గొన్నారు.
రక్తదానానికి విశేష స్పందన..
నేరడిగొండ, ఫిబ్రవరి 17 : నేరడిగొండలో ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి యువకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. 700 మంది యువకులు స్వచ్చందంగా రక్తదానం చేసి కేసీఆర్‌పై అభిమానాన్ని చాటారు. ఎమ్మెల్యే కూడా కార్యకర్తలతో కలిసి రక్తదానం చేశారు. రక్తదానం చేసేందుకు వచ్చిన అభిమానులకు ఎమ్మెల్యే అన్నదానం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రక్తదాన శిబిరాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, ప్రీతంరెడ్డి, తుల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సయ్యద్ జహీర్, వీడీసీ చైర్మన్ రవిందర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ తిరుమల్‌గౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లె నానక్‌సింగ్, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, మండల కన్వీనర్లు శివారెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు,మాజీ ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు పాల్గొన్నారు.
భీంపూర్, ఫిబ్రవరి 17: భీంపూర్ మండలంలో కరంజి(టీ) రామాలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగాపూజలు చేశారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. మండల నాయకులు నేరడిగొండ వెళ్లి అక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. యువకులు రక్తదానం చేశారు. ఎమ్మెల్యే అనిల్జాదవ్తో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీలు జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ కుడిమెత రత్నప్రభ, గడ్డం లస్మన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, నాయకులు గోవర్ధన్ యాదవ్, జీ నరేందర్, లింబాజీ, కల్చాప్యాదవ్, పెంటపర్తి లస్మన్న, బొంత నితిన్, జహూర్ అహ్మద్, రవీందర్, అనిల్, స్వామి సహా రైతులు ఉన్నారు.
బోథ్, ఫిబ్రవరి 17 : బోథ్ మండలకేంద్రంలో స్థానిక బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ మాజీ చైర్మన్ సుభాష్, మెడిచెల్మ ప్రవీణ్, రమణ గౌడ్, ఊశన్న, లక్ష్మణ్, భీంరావ్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నేరడిగొండలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి లంబాడీ తండాకు చెందిన సుమారు 20 మంది వరకు యువకులు తరలివెళ్లారు.
ఉట్నూర్, ఫిబ్రవరి 17 : ఉట్నూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ మండల ఇన్చార్జి పంద్ర జైవంత్‌రావు, విజయ్, భరత్ చౌహన్, పెందూర్ ప్రభాకర్, సలీం, అజయ్, సింగారే భరత్, కాటం రమేశ్, శ్యాం, రమేష్, సోనేరావు, చౌకత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి17: ఇంద్రవెల్లిలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. భీంనగర్‌లోని ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు నోట్ బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు మిర్జా జిలానీబేగ్, ఇంద్రవెల్లి మాజీ ఉప సర్పంచ్ గణేశ్ టేహేరే, నాయకులు జాదవ్ ప్రకాష్, శ్రీనివాస్, శ్యామ్కేంద్రే, సురజ్, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, ఫిబ్రవరి17 : నార్నూర్‌లోని గాంధీ చౌరస్తా వద్ద జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్,నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ చైన్‌గేట్, ఫిబ్రవరి,17: నిర్మల్ వైద్యకళాశాల దవాఖానలో బీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, సుభాష్‌రావు, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
కుంటాల, ఫిబ్రవరి, 17 : నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంటవార్ దశరథ్ కుంటాల మండలంలోని కల్లూరు జాతీయ రహదారి పక్కన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాసరి కిషన్, పార్టీ నాయకులు వంశీ, కార్యకర్తలున్నారు.
దిలావర్పూర్, ఫిబ్రవరి 17 : నిర్మల్‌లోని ఏరియా దవాఖానలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాజీ ఎంపీపీ ఏలాల అమృత చిన్నరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ మాజీ సభ్యులు డాక్టర్ సుభాష్‌రావు, నర్సాపూర్(జీ)మండలాధ్యక్షుడు సుదన్, గంగారెడ్డి, మాజీ నిర్మల్ మార్కెట్ కమిటీ సభ్యులు రాథోడ్ అశోక్, కార్యకర్తలు అభిమానులున్నారు.
ముథోల్, ఫిబ్రవరి, 17 : ముథోల్తోపాటు బోరిగాంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎంపీటీసీ గంగాధర్, మాజీ సర్పంచ్ మరీబా, నాయకులు అంజయ్య, లతీఫ్, విట్టల్ కాంబ్లే, గంగాధర్, భూమన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.
భైంసా, ఫిబ్రవరి, 17 : బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వేడుకల్లో బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నాయకురాలు డాక్టర్ పడకంటి రమాదేవి, బీఆర్ఎస్ నాయకులు రాజేశ్, రావుల పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
బాసర, ఫిబ్రవరి 17 : నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ ఆదేశాల మేరకు మండల నాయకులు సరస్వతీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులున్నారు. అనంతరం అన్నదాన ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఖానాపూర్ రూరల్, ఫిబ్రవరి 17 : ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బహ్రెయిన్‌లో కేసీఆర్ జన్మదినం వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్, బొలిశెట్టి వెంకటేశ్, మగ్గిడి రాజేందర్, కిరణ్ గౌడ్, రాజలింగం,శ్రీనివాస్, దేవదాసు, రాజేందర్, వెంకటేశ్, రాము నాయకులున్నారు.
ఖానాపూర్, ఫిబ్రవరి 17: మండల బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు గౌరికర్ రాజు, రాజగంగన్న, కొక్కుల ప్రదీప్, శ్రావణ్, సుమీత్ , బీఆర్ఎస్ నాయకులు పాల్గ్గొన్నారు.
కుంటాల, ఫిబ్రవరి, 17 : యూకేలోని హౌనస్లోలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎప్దీసీ మాజీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరిగౌడ్ నవాబ్‌పేట్, రవి రేటినేని, సతీశ్ రెడ్డి గొట్టి ముక్కల, సత్యమూర్తి చిలుముల, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు చైర్మన్ చందు గౌడ్, సిక్కా అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, గణేశ్ కుప్పాల, అడ్వైజరీ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ వీర, గణేశ్ పాస్తం, మధుసూదన్ రెడ్డి, కార్యదర్శులు మల్లారెడ్డి, సతీశ్ రెడ్డి బండ, కార్యదర్శి ఐటీ, మీడియా, పీఆర్ రవి, ప్రదీప్ పులుసు, అజయ్ రావు గంద్ర, అధికార ప్రతినిధి సాయిబాబా కోట్ల, కమ్యూనిటీ అపైర్స్ చైర్మన్ రమేశ్ ఇసంపల్లి, లండన్ ఇన్చార్జి సత్యపాల్‌రెడ్డి పింగలి, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ కలకుంట్ల, ముఖ్య సభ్యులు సాయికిరణ్ రావు, పవన్ కుమా ర్ గౌడ్, నర్సింగ రావు, టాక్ సంస్థ సభ్యులు పవిత్ర రెడ్డి, సుప్రజ పులుసు, క్రాంతి రేటినేని, పావని, స్నేహ, తెలంగాణ జాగృతి సభ్యులు సుమన్ రావు, బల్మూరి, వంశీ తులసి ఉన్నారు.
కుభీర్, ఫిబ్రవరి 17 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మొహియుద్దీన్, దొంతుల దత్తాత్రి, గోరేకర్ కాశీనాథ్, వడ్నం దత్తాత్రి, గంధం పోశెట్టి, కందుర్ దత్తు, ఠాకూర్ దత్తుసింగ్, కోలేవార్ లక్ష్మణ్, పుప్పాల దేవన్న, కార్యకర్తలున్నారు.
దస్తురాబాద్, ఫిబ్రవరి 17 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముడికే ఐలయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. మాజీ వైస్ ఎంపీపీ భూక్యా రాజునాయక్, మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి, మాజీ సర్పంచ్ దుర్గం శంకర్, గ్రామాధ్యక్షుడు ఎండపెల్లి గంగన్న, సోషల్ మీడియా ఇన్చార్జి బొమ్మెన గోపి, నాయకులు దాసరి సుధాకర్, అప్పని రాజు, మణిక్ రావు, రాములు, రాజేందర్, మహేశ్, రాజలింగం, నర్సయ్య, కిషోర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
సోన్, ఫిబ్రవరి 17 : మండలంలోని కొండాపూర్‌లోని తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్‌రెడ్డి, జడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యులు సుభాష్‌రావు, పట్టణాధ్యక్షులు మారుగొండ రాము, మాజీ ఎంపీటీసీ మహేశ్‌రెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షులు లక్ష్మణచారి, సోన్ మాజీ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ న హీం, నజీరొద్దీన్, నాయకులు, తదితరులున్నారు.
అడెల్లి ఆలయంలో బీఆర్ఎస్ నాయకుల పూజలు
సారంగాపూర్, ఫిబ్రవరి 17 : మండలంలోని అడెల్లి పోచమ్మ ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సమీపంలో మొక్కలు నాటారు. తాండ్ర(జీ) గ్రామంలో కేక్‌కట్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, ధనంజయ్, రవికృష్ణ పటేల్, గంగన్న, అల్లిసాబ్, సాయినాథ్, బాపయ్యపటేల్, నర్సయ్య తదితరులున్నారు.
కుంటాల, ఫిబ్రవరి, 17 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ కన్వీనర్ పడకంటి దత్తాత్రి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బొంతల పోశెట్టి, శ్రీనివాస రావు, కళ్యాణ్, సిర్ల గంగారాం, హన్మండ్లు, కార్యకర్తలు ఉన్నారు.
కడెం, ఫిబ్రవరి 17: మండలంలోని లింగాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం వీరబ్రహేంద్రస్వామి ఆలయ ప్రాంగంణంలో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్‌నాయక్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, రంజిత్, లచ్చన్న, రఫీక్, నాయకులున్నారు.
తాంసి(భీంపూర్), ఫిబ్రవరి 17 : భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది రైతులు, ఇతర వృత్తుల వారు, బీఆర్ఎస్ నాయకులు కేమ రాజన్న, ముకుంద సంతోష్, అనిల్, నారాయణ రెడ్డి, యువకులు పాల్గొన్నారు.