వెల్లువెత్తిన అభిమానం.. ఘనంగా మంత్రి అల్లోల జన్మదిన వేడుకలు
రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 16 : రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులు ట్విట్టర్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం భాగ్యలక్ష్మి మిల్క్ సెంటర్ నిర్వాహకుడు దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన పోలీస్ శాఖ ఉద్యోగుల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. శాస్త్రీనగర్లో లక్కాడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట
భైంసా, ఫిబ్రవరి 16: దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ వేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కుంటాల మండలం ఓలా గ్రామంలోని విఠలేశ్వరాలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి మంత్రి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయ కత్వంలో రాష్ట్రంలోని యాదాద్రి, వేముల వాడ, కొండగట్టు, బాసరతో పాటు ఎన్నో ఆలయాలకు దేవాదాయ శాఖ తరఫున పూర్వవైభవం తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ దశల వారీగా నిధులు మంజూరు చేస్తామ ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఓలాలో దేవాలయాల అభివృద్ధికి రూ. 1.25 కోట్ల మంజూరైనట్లు తెలిపారు.
కుంటాల గజ్జలమ్మ ఆలయంతో పాటు ముథోల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్పారు. గందెవారి పరివారం ఆలయానికి రూ. 60 లక్షలు ఇవ్వగా, ప్రభుత్వం తరఫున మరిన్ని నిధులు మంజూరు చేశామని చెప్పారు. ఓలా లోని సబ్ స్టేషన్ ఏర్పాటు చేశామని, చెప్పారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్, సర్పంచ్ ఖనీష్ ఫాతిమా, పడకంటి దత్తు, జుట్టు మహేందర్, సాగర్ రావు, సదాశివ్ పటేల్, హైమద్ పాషా, బుచ్చన్న, బీవీ రమణా రావు, పలు గ్రామాల సర్పంచ్లు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

