కడెం, నవంబర్ 14 : ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ అండదండలతో ఖానాపూర్ నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి భుక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండలం లోని కొత్తమద్దిపడగ, ధర్మాజిపేట, కన్నాపూర్, కొండుకూర్, పాండ్వాపూర్, అంబారిపేట, నవా బుపేట, లక్ష్మీపూర్, కల్లెడ, గ్రామాల్లో పర్యటిం చారు. జాన్సన్‌నాయక్‌కు మహిళలు మంగళ హారులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయా గ్రామాల సర్పంచ్‌లతో కలిసి ఊరేగింపు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. తనను గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని, ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ప్రధా నంగా కడెం ప్రాజెక్టు పరిస్థితిని సీఎం, కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లానని, ఎన్నికల అనంతరం ప్రాజెక్టు మరమ్మతు చేపడుతామని హామీ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సర్పంచ్‌లు జడ రాజమణిఇందూర్, ఓర్సు వెంకటేశ్, గోళ్ల వేణు గోపాల్, కొప్పుల లక్ష్మీ లచ్చన్న, పిన్నం మల్లవ్వ మల్లేశ్, విజయ రాజన్న, ఎంబడి లావణ్య తిరు పతి, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజే శ్వర్‌గౌడ్, మండల అధ్యక్షుడు జొన్నల చంద్ర శేఖర్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ హైమద్, ఆత్మ చైర్మన్ కానూరి సతీశ్, నాయకులు స్టీఫెన్, ఆకుల లచ్చన్న, కోల నరేశ్, కొప్పుల లచ్చన్న, పిన్నం మల్లేశ్, రాజిరెడ్డి, కరుణాకర్, వెంకటేశం, భూత్కూర్ మల్లేశ్, ముల్కల్ల రమేశ్, దాసండ్ల లక్ష్మీనారాయ ణ, కిషన్, సురేందర్, సన్నీ, తిరుపతిరెడ్డి, అయా గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా నాయకుడికి పట్టం కట్టాలి
ఖానాపూర్, నవంబర్ 14 : ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్‌ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మంగళవారం రెండు, ఏడో వార్డుల్లో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. పదేండ్లకు ముందు.. పదేండ్ల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ రాజేందర్, నాయకులు ద్యావతి రాజేశ్వర్, బక్క శెట్టి కిశోర్, గుగ్గిళ్ల రాజేందర్, జన్నారపు శంకర్, ప్రదీప్, మహేశ్, కిశోర్, చింటూ, లక్ష్మణ్, మల్లేశ్, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
10వ వార్డులో..
ఖానాపూర్ టౌన్, నవంబర్ 14 : 10వ వార్డులో నాయకులతో కలిసి కౌన్సిలర్ తొంటి శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి జాన్సన్ నాయక్‌ను గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని వివ రించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.
రాజురాలో..
ఖానాపూర్ రూరల్, నవంబర్ 14: రాజురా గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. పల్లెల్లో జరిగిన అభివృద్ధిపై ప్రజలు అలోచన చేసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించా లని కోరారు. పెంబి జడ్పీటీసీ జానుబాయి, చిన్నం రవి, పులివేని సత్యనారాయణ, లింగన్న, పెద్దిరాజు, శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.
పస్పులలో..
పెంబి, నవంబర్ 14 : పస్పుల గ్రామంలో ఇంటింటా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకే ఓటు వేసి జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బడుగు మల్లేశ్ బీఆర్ఎస్ నాయకులు ధర్మేందర్, సైఫ్ అలీ, షారూఖ్‌ఖాన్, రియాజ్, సాయివర్ధ్దన్ తదదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్‌లో..
ఉట్నూర్, నవంబర్ 14 : ఉట్నూర్‌లోని పలు కాలనీల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కరపత్రాలను అందజే శారు. మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారని పేర్కొన్నారు. నాయకులు ఆశన్న, మల్లన్న తదితరులున్నారు.
ఉట్నూర్ మండలంలో..
ఉట్నూర్ రూరల్, నవంబర్ 14: మండలం లోని వేణునగర్‌లో గ్రామంలో డీసీసీబీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్ సీనియర్ నాయకుడు మర్సుకోల తిరుపతి తో కలిసి ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. లక్కారం ఉప సర్పంచ్ కోల సత్తన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందుకూరి రమేశ్, ప్రధాన కార్యదర్శి సెడ్మకి సీతారాం, భక్తు రాజన్న, ఎండీ మక్బుల్, రంజనాబాయి, బబిత, భూమన్న, బలవంత్, ఆశన్న, కేశవ్, గంగేశ్వర్, దూట మహేందర్, సాజిత్ సిద్ధిఖీ, గంగరాజు, మల్లయ్య, మనోహర్, గవాస్కర్, వసంత్ ఉన్నా రు. హస్నాపూర్‌లో నాయకులు కారుగుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. అజ య్, జాదవ్ వసంత్, మాను, ఉన్నారు. బిర్సా యిపేట్ గ్రామంలో నాయకులు ఎన్నిక ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని విన్నవించారు. కొత్త గూడ గ్రామంలో కారు గుర్తుకు ఓటు వేయాలని నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నాయకులు తుడుం ప్రశాంత్, మోహన్ నాయక్, శ్రీనివాస్, సుందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాల మాటలను నమ్మవద్దు
దస్తురాబాద్, నవంబర్ 14 : ప్రతిపక్షాల మాటలను ప్రజలు నమ్మవద్దని ప్రజాప్రతి నిధు లు, నాయకులు పేర్కొన్నారు. భూత్కూర్, రేవోజిపేట మంగళవారం బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వ హించారు. ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.