ఆదిలాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ) ః పదేండ్ల బీఆర్ఎస్ పాలన అభివృద్ధి, సంక్షే మం దిశగా సాగింది. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి బీఆర్ఎస్ సర్కా రు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అ మలు చేసింది. ఇందులో భాగంగా నూతన కలెక్టర్ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టిం ది. ప్రజలకు మెరుగైన సేవలు అందడంతోపాటు అన్ని ప్రభుత్వశాఖలు ఒకేచోట ఉండే లా, సకల సౌకర్యాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించింది.
ఆదిలాబాద్ జిల్లాలో రూ. 55 కోట్లతో సర్వే నంబరు 72 /1 / 6 లో 19 ఎకరాల్లో న్యూ హౌసింగ్‌బోర్డు ప్రాంతం లో కొత్త కలెక్టరేట్ నిర్మాణాన్ని చేపట్టింది. 17 ఎకరాల స్థలం కేటాయించగా నాలుగెకరాల్లో భవనాల నిర్మాణాలు ప్రారంభించారు. అధికారులు రూపొందించిన ప్లాన్ ప్రకారం 1.20 లక్షల స్కేర్ ఫీట్లతో జీ ప్లస్ 2 అంతస్తులతో వివిధ కార్యాలయాల సముదాయాలను నిర్మించాల్సి ఉంది. 2023 జూన్‌లో ప్రారంభమైన పనులు ఏడాదిలో పూర్తి కావాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లుల పంపిణీలో జాప్యం చేయడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మూడు సంవత్సరాల నుంచి పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
కలెక్టర్ భవనం కూలడంతో తిరిగి ప్రారంభం
గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా సెప్టెంబరు 11న కలెక్టరేట్ భవనం కూలింది. దీంతో అధికారులు భవన నిర్మాణ పనులను వేగవంతం చేశారు. భవనం కూలిపోవడంతో అడిషనల్ కలెక్టర్ కార్యాలయంతోపాటు ఆర్డీవో, పౌర సరఫరాల శాఖ ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్లోని వివిధ విభాగాలను ఇతర భవనాల్లోకి మార్చారు. భవనం నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేసి అందులోని అన్ని విభాగాలను తరలించవచ్చనే ఆలోచన చేశారు.
ఈనెల 30 లోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించగా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. వర్షాకాలం ప్రారంభం కాగా మరో ఆరు నెలల వరకు భవనం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పలు కార్యాలయాలకు తమ పనుల కోసం ప్రభుత్వ అధికారులను కలవడానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. భవన నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేసి తమ పనుల కోసం వచ్చే వారికి అన్ని శాఖలు ఒకే చోట ఉండలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.