పెంబి, నవంబర్ 7 : ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్య క్షుడు సల్లా నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ జానుబాయి పేర్కొన్నారు. మంగళవారం మందపల్లి గ్రామం లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి భుక్యా జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైస్ ఎంపీపీ గంగారెడ్డి, సర్పంచ్‌లు పూర్ణచందర్ గౌడ్, సుధాకర్, నాయ కులు విలాస్, రూప్సింగ్, గాండ్ల శంకర్, సుతారి మహేందర్, నరేందర్, రమేశ్ పాల్గొన్నారు.
భూక్యా జాన్సన్ నాయక్‌ను గెలిపిద్దాం
ఖానాపూర్ రూరల్, నవంబర్ 7 : ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా భూక్యా జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా పంపుదామని బీఆర్ఎస్ నాయ కులు పేర్కొన్నారు. ఖానాపూర్ మండలం గోసం పల్లె, గోడలపంపు గ్రామాల్లో బీఆర్ఎస్ కార్య కర్తలు విస్తృత ప్రచారం చేపట్టారు. లబ్ధిదా రులతో కలిసి గడపగడపకు తిరుగూతూ ప్రచారం నిర్వ హించారు. తూము చరణ్, అమంద శ్రీని వాస్, నామెడ ధర్మరాజు, రాజలింగం, లవం గాల శివ, గ్రామస్తులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నాయకులు
కడెం, నవంబర్ 7 : మండల కేంద్రానికి చెంది న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీ చంద్రయ్య మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆత్మ కమిటీ చైర్మన్ కానూరి సతీశ్, దిల్దార్‌నగర్ సర్పంచ్ బద్దెనపల్లి విజయ-స్టీఫెన్ ఆధ్వర్యంలో మంగళవారం కడెం బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయనతో పాటు, మరికొంత మంది నాయకులు పార్టీలో చేరారు. నాయకులు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఖానాపూర్ నియోజక వర్గం లో జాన్సన్‌నాయక్ గెలుపునకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీ మండల ఉపాధ్యక్షుడు పల్లె మల్లారెడ్డి, నాయకులు ఎండీ కలీం, రమేశ్ నాయ క్, యూత్ మండల అధ్యక్షుడు గౌసొద్దీన్, సోషల్ మీడియా ఇన్చార్జి ఎండీ హాసీబ్, నబీ, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్‌లో..
ఖానాపూర్, నవంబర్ 7 : మున్సిపల్ ఆరో వార్డు శాంతినగర్ కాలనీలో జరిగిన ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ పాల్గొన్నా రు. భూక్యా జాన్సన్ నాయక్‌ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నాయకులు ఖలీల్, మెహ్రజ్, సోయాబ్, చింటూ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉట్నూర్‌లో..
ఉట్నూర్, నవంబర్ 7 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భగా పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కర పత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి ఖానాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భుక్యా జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని కోరారు. మాజీ ఎంపీ టీసీ సలీం, రామగిరి వాసు, షౌకత్, అన్సర్, కామెర రాజు, జాడి వెంకటేశ్, జుబేర్, మల్లయ్య, అన్వర్, ఆశన్న, లతీఫ్, సుశీల్ పాల్గొన్నారు.
ఉట్నూర్ మండలంలో..
ఉట్నూర్ రూరల్, నవంబర్ 7 : శ్యాంపూర్ గ్రామంలో వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, బీఆర్ ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్‌తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ డైరెక్టర్ బదావత్ పూర్ణ చంద ర్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారం సంతలో కారు గుర్తుకు ఓటు ఓటు వేయాలని ఓటర్లకు అభ్యర్థించారు. లక్కా రం పరిధిలోని కేబీ నగర్లో సీనియర్ నాయకుడు మర్సుకోల తిరుపతి నాయ కులతో కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. దంతన్‌పెల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసండ్ల ప్రభాకర్ ప్రచారం చేశారు. చాందూరి, హస్నాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఆయా చోట్ల బీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు కందుకూరి రమేశ్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్, శ్యాంపూర్ సర్పంచ్ మల్లిక, బీఆర్ఎస్ మండల ప్రదాన కార్యదర్శి సెడ్మకి సీతారం, కాటం రమేశ్, స్వామి, ముకుంద్ రావు, బాబా శ్యాం, సుభాష్, సల్గర్ రవీందర్, హరీశ్, శ్యాం, మర్సుకోల సర స్వతి, సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ కోల సత్తన్న, భక్తు రాజన్న, రాజమణి, రంజనాబాయి, భూమన్న, సిడాం సోనేరావు, బలవంత్, ముంజం అనుదీప్, ఆశన్న, కేశవ్, గంగేశ్వర్, ఆశన్న, పోసక్క, దూట మహేందర్, సాజిత్ సిద్దికి, ఎండీ మక్బుల్, గంగరాజు, మల్లయ్య, సులేమన్ యాఫై, వసంత్, నవీన్, యేసు, లచ్చన్న, సత్యం, మోతీలాల్, సందీప్ రెడ్డి, రజాక్, ఎల్లయ్య, ఫారూక్, అజయ్, వసంత్ నాయక్ నాయకులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ డైరెక్టర్ బదావత్ పూర్ణ చందర్ నాయక్ శ్యాంపూర్ గ్రామంలో వినూ త్నంగా ప్రచారం నిర్వహించారు. చికెన్ షాపులో చికెన్ కొడుతూ, కుట్టు మిషన్‌పై బట్టలు కుడుతూ, లాండ్రీ షాపులో ఇస్త్రీ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు.
ఇంద్రవెల్లిలో..
ఇంద్రవెల్లి, నవంబర్ 7 : బీఆర్ఎస్ నాయ కులు మంగళవారం మండలం కేంద్రంతో పాటు శంకర్‌గూడ, ఏమాయికుంట, సమాక, కేస్లాగూడ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఖానాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భుక్యా జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించా లని సూచించారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అంజద్, బీఆర్ఎస్ మండల కోఆర్డినేటర్ షేక్ సూఫియాన్, మండల ఉపాధ్యక్షుడు ఆరెల్లి రాందాస్, ప్రధాన కార్యదర్శి కనక హన్మంత్‌రావు, వైస్ ఎంపీపీ గోపాల్ సింగ్, మండల కోఆప్షన్ సభ్యుడు మిర్జా జిలానీ బేగ్, సర్పంచ్ జాదవ్ లఖన్ సింగ్, ఎంపీటీసీ మడావి భీంరావు, నాయ కులు సర్కాలే శివాజీ, నవాబ్బేగ్, వాగ్మారే బాబు, బాలసింగ్, అశోక్ పాల్గొన్నారు.
సమన్వయంతో పని చేయాలి
ఉట్నూర్, నవంబర్ 7 : ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమ న్వయంతో పనిచేయాలని గ్రీన్ ఇండియా ఛాలెం జ్ డైరెక్టర్ బదావత్ పూర్ణ చందర్ పేర్కొ న్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, పార్టీ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, సీనియర్ నాయకుడు దాసండ్ల ప్రభాకర్, సాడిగే రాజ్ కుమార్, ముకుంద్ రావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ లు, నాయకులు పాల్గొన్నారు.