కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ( BRS candidate) అత్యధిక మెజార్టీతో గెలిపించా లని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి ( Ramana reddy ) పిలుపు నిచ్చారు.
ఆదివారం కాసిపేట మండలంలోని దేవాపూర్ మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్ధి మడావి అనంత రావుతో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించి బీఆర్ఎస్ అభ్యర్థి అనంతరావు పానా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు రక్ష బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గొంది వెంకటరమణ, సర్పంచ్ అభ్యర్థి మడావి అనంతరావు, కైలాస్, మచ్చ అశోక్, సంజీవ్, కొంగ విజయ్, అనీల్, శంకర్, నరేష్, గంధం శ్రీనివాస్, మోటూరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.