తాండూర్ : కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న పోరుబాట ( Porubata )ను విజయవంతం చేయాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (Durgam Chinnaiah) అన్నారు. తాండూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు అమలుకాని 6 గ్యారెంటీలు, 420 హామీలను 100 రోజులలోనే అమలుచేస్తామని నమ్మించి రేవంత్ గద్దెనెక్కారని ఆరోపించారు.
ప్రభుత్వం 1000 రోజులు గడిచినప్పటికీ నేటివరకూ వాటిని పూర్తిస్థాయిలో అమలుచేయకుండా వంచించినందున బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 2న పోరుబాట నిరసన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం బెల్లంపల్లి నియోజకవర్గకేంద్రంలో ధర్నా, బాకీ కార్డులు పంచడం, 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, నాయకులు తాళ్లపల్లి పురుషోత్తం గౌడ్, మంగపతి సురేష్ బాబు, పూసాల ప్రణయ్ కుమార్, బోనగిరి చంద్రశేఖర్, మాసాడి శ్రీరాములు, గట్టు సంతోష్, మొగిలి శంకర్, జాడి పోశం, అర్జున్, పెరిక రాజన్న, బోడ సతీష్, బాబు ఖాన్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.