నెన్నెల/కాసిపేట, జూన్ 6 : నెన్నెల మండలం గుండ్ల సోమారం గ్రామంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పది పెంకుటిళ్లు, రేకుల షెడ్ల పై కప్పులు లేచిపోయాయి. పలుచోట్ల చెట్లు విరిగి పడగా, కరంటు స్తంభాలు ఇండ్లపై పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దెబ్బతిన్న ఇండ్లను జడ్పీటీసీ సింగతి శ్యామల పరిశీలించారు. కాసిపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలలతో కూడిన భారీ వర్షం పడగా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రహదారిపై భారీ వృక్షాలు విరిగి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాసిపేట రహదారిపై చెట్లు పడిపోవడంతో పంచాయతీ అధికారులు జేసీబీ సాయంతో తొలగించారు.