చెన్నూర్, ఆగస్టు 11 : కేసీఆర్ సర్కారు చెన్నూర్ నియోజకవర్గంలో వంతెనలు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం కోసం నిధులు మంజూ రు చేయగా, కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. బ్రిడ్జిలు, చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్, కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయగా, 2023, ఆగస్టు11న రూ.11.70 కోట్లు మంజూరు చేశారు.
చెన్నూర్ మండలంలోని చింతలపల్లి-అక్కెపల్లి గ్రామాల మధ్యనున్న వాగుపై బ్రిడ్జి, చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ.3,20 కోట్లు, మందమర్రి మం డలంలోని పాలవాగుపై బ్రిడ్జి, చెక్ డ్యామ్ నిర్మాణానికి రూ 2.50 కోట్లు, అందుగులపేట వాగుపై బ్రిడ్జి, చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ. 3 కోట్లు, పులిమడుగు వద్ద వాగుపై బ్రిడ్జి, చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ. 3 కోట్లు మంజూరు చేశారు. కానీ.. కాంగ్రెస్ సర్కా రు అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తు న్నా ఆ నిర్మాణాలపై ఊసెత్తడం లేదు. ప్రస్తు త ఎమ్మెల్యే వివేక్ వాటి నిర్మాణాల కోసం చొరవ తీసుకోవడం లేదు.
నిధులున్నప్పటి కీ వంతెనల నిర్మాణాల గురించి మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని సొంత మీడియాలో ప్రచారం చేసుకోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన చెన్నూర్ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మె ల్యే సుమన్ అనేక అభివృద్ధి పనులు చేపట్టడమేగాక వాగులపై 22 బ్రిడ్జిలు నిర్మించి ప లు గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించిన విషయం విదితమే. ఇకనైనా ఎలాంటి బేషజాలకు పోకుండా బీఆర్ఎస్ ప్ర భుత్వం మంజూరు చేసిన బ్రిడ్జిలు, చెక్‌డ్యామ్‌లను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.