తలమడుగు, జూలై 25 : మారుమూల ప్రాంతాల్లో విడతలవారీగా సౌకర్యాలు కల్పిస్తున్నామని, మారుమూల ప్రాంతాలకే ఎమ్మెల్యేగా మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేరొన్నారు. శనివా రం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడిలో పర్యటించారు. రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భావనాన్ని ప్రారంభించారు. పాఠశాలలో రూ.2 లక్షల వ్యయంతో విద్యార్థుల కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
అనంతరం రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెంది న 20 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, 10 మంది మహిళా సమాఖ్య సభ్యులకు చె క్కులు పంపిణీ చేశారు. అనంతరం కుచులాపూర్ గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించే మహి ళా సమాఖ్య భవనానికి నాయకులతో భూమిపూజ చేశారు.
విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. రైతుల కోరిక మేరకు త్వరలోనే విద్యుత్ సబ్ స్టేషన్ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌లు మగ్గిడి నర్సమ్మ, వెంకన్న, తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంపీడీవో శంకర్, ఏపీఎం చంద్రశేఖర్, ఏవో ప్రమోద్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ కన్వీనర్ తోట వెంకటేశ్, నాయకులు ముడుపు కేదారేశ్వర్‌రెడ్డి, మొట్టె కిరణ్, మగ్గిడి ప్రకాశ్, ఆశన్న యాదవ్, అభిరాంరెడ్డి, అబ్దుల్లా, వామన్, శ్రీనివాస్, పల్లవి, రాంబాయి పాల్గొన్నారు.