బోథ్, ఫిబ్రవరి 15: శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో నడవాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బోథ్‌లోని సాయినగర్‌లో సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని బుధవారం నిర్వహించారు. చిత్ర పటానికి పూజలు చేసి జెండా ఎగురవేశారు. భోగ్ బండార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజనుల ఉద్ధరణ కోసం సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి మరువలేనిదన్నారు. భావితరాలకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్, నరేశ్ జాదవ్, మాన్సింగ్ మహారాజ్, సేవాలాల్ మండల కమిటీ, గ్రామ కమిటీల సభ్యు లు, వివిధ గ్రామాల బంజారాలు పాల్గొన్నా రు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. బోథ్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో సే వాలాల్ జయంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ సీఐ కిరణ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ ప్రకా శ్, ఎంపీవో జీవన్‌రెడ్డి, ఈవో అంజయ్య, ఏపీ ఎం మాధవ్, యూబీఐ, టీజీబీల మేనేజర్లు విజయ్‌కుమార్, ప్రహ్లాద్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి15 : మండలకేంద్రంతోపాటు మండలంలోని లంబాడా తండాల్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని సేవాలాల్ జెండాను ఆవిష్కరించారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ఫూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం భోగ్ బండార్ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బంజారాల నాయకులు రాథోడ్ మోహన్‌నాయక్, ప్రేమ్‌సింగ్, అనిల్రాథోడ్, మంగీలాల్, సంజీవ్‌నాయక్ పాల్గొన్నారు.
నేరడిగొండ, ఫిబ్రవరి 15 : మండలంలోని లఖంపూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సేవాలాల్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోందిడి గ్రామంలో సేవాలాల్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అశోక్‌రావ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఫిబ్రవరి 15 : భక్తి భావనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని జడ్పీటీసీ జాదవ్ అనిల్ ప్రజలకు సూచించారు. మండలంలోని రాజురా గ్రామంలో సేవాలాల్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జగదాంబదేవి ఆలయంలో గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తిమార్గాన్ని అనుసరించాలని తెలిపారు. ఆలయం ఆవరణలో పూజారి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం జగదాంబదేవి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనసూయబాయి, నాయకులు జాదవ్ వసంత్‌రావ్, రాథోడ్ రవిందర్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
భీంపూర్, ఫిబ్రవరి 15 : మండలకేంద్రం లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం మహిళలు కలశాలతో, పెద్దలు పల్లకీతో డప్పువాయిద్యాల మధ్య శోభాయాత్రగా మందిరానికి వెళ్లారు. సేవాలాల్ మందిరంలో పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని సేవాలాల్ మహారాజ్‌కు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జాదవ్ రవీందర్, ఉత్తం రాథోడ్, మహేశ్ నాయక్, ధరంసింగ్ తదితరులు పాల్గొన్నారు.