బోథ్, జనవరి 2 : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని కన్గుట్ట గ్రామంలో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి సోమవారం ఆయన భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎంపీపీ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కుల సంఘాల బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
భవన నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బోథ్ పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ శ్యామల, రమేశ్, ఉపసర్పంచ్ మునిగెల రమేశ్, మున్నూరు కాపు సంఘం బాధ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కుటుంబీకులను పరామర్శ
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కుటుంబీకులను సోమవారం ఎంపీపీ తుల శ్రీనివాస్ పరామరర్శించారు. ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి బిక్కునాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీ వెంట సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.