ఇంద్రవెల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కాగ్నే ఫంక్షన్ హాల్ లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. విజయం కోసం పక్కా ప్రణాళికతో ప్రజల ముందుకు వెళ్లాలని సూచించారు.
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడిగే పరిస్థితి లేదని, మనమంతా ధైర్యంగా ముందుకెళ్లి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవల్సిన అవసరం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు మారుతిపటేల్ డోంగ్రే. మాజీ ఎంపీపీ పోటే శోభాబాయి. నాయకులు అంజద్. జిలానీ బేగ్. సుఫియాన్. విజయ్ కుమార్. గణేష్ టేహెరే. పుర్క బాపురావ్. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.