భైంసా, మార్చి 15 : పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న షేక్ హైమద్ మియ్యాను ఈ నెల 8న హత్య చేసి పరారైన నిందితులను రిమాండ్ చేసినట్లు భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో బుధవారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న షేక్ హైమద్ మియ్యాకు బిహార్‌కు చెందిన కూలీల మధ్య చిన్న గొడవ జరిగింది.
ఈ క్రమంలో వారు షేక్ హైమద్ మియ్యాను నెట్టివేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే బిహార్‌కు చెందిన కూలీలు ఫ్యాక్టరీలోని గడ్డిలో అతడిని పడేసి వెళ్లిపోయారు. అనుమానం రావడంతో రెండు బృందాలతో గాలించగా బీహర్‌లో రాంప్రిత్ సదా, బైరవ్ సదాను పట్టుకొని విచారించగా పూర్తి వివరాలు తెలియజేశారన్నారు. భైంసాలో బిట్టు సదా, పంకజ్ సదాను పట్టుకున్నామని తెలిపారు. మరో నలుగురు నిందితులు శ్యామ్యాదవ్, సోబోద్ సదా, యోగి సదా, మంతున్ సదా ఇంకా దొరకలేదన్నారు. వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. ఈ కేసును ఛేదించడానికి సహకరించిన ఎస్ఐ తిరుపతి, ఎస్ఐ శ్రీనివాస్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సమావేశంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ శివ, సిబ్బంది ఉన్నారు.