బెల్లంపల్లి : ఐఐటీ నీట్ ఫౌండేషన్ ( IIT NEET Foundation ) ప్రవేశ పరీక్షలలో బెల్లంపల్లి సీఓఈ కి చెందిన 15 మంది విద్యార్ధులు (Bellampalli students ) ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ (Principal Akidi Vijayasagar) తెలిపారు. గౌలిదొడ్డి ఐఐటీ ఫౌండేషన్ కోర్సులో డి శోభిత్, డి సిద్ధార్ధ, బి సాయి సృజన్, చిలుకూర్ ఐఐటీ కోర్సులో కే నవనీత్, ఉప్పల్ ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో డీ అసిత్, ఎం శ్రావణ్, డీ రుతిక్ తేజ, కే కార్తిక్ ఎంపికయ్యారని వివరించారు.
ఇబ్రహీంపట్నం ఐఐటీ ఫౌండేషన్ కోర్సులో ఎన్ రుషికేష్, బి ఉషాకిరణ్, డి వరప్రసాద్, ఎం పూనం చందర్ , కే కార్తీక్, పీవీ రాజులు సీట్లు సాధించినట్లు పేర్కొన్నారు. వీరిని కళాశాలలో లెక్చరర్లు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు మరింత కష్టపడి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చాలని సూచించారు.