హాజీపూర్, సెప్టెంబర్ 4 : ఎలుగుబంటి దాడి లో మేకల కాపరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామానికి చెందిన జగన్నాథుల నాగరాజుకు చెందిన మేకలు మేతకు వెళ్లి ఇంటికి రాలేదు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ముల్కల్ల ర్యాలీ వాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా పిల్లలతో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా నాగరాజు ముఖంపై దాడి చేసింది.
తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న నాగరాజును ముల్కల్ల గ్రామానికి చెందిన కొందరు రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డీఎఫ్వో శివ్ ఆశిష్ సింగ్ ఆదేశాల మేరకు ఎంజీఎంకు వెళ్లి నాగరాజును పరామర్శించి రూ.20 నగదును కుటుంబ సభ్యులకు ఫారెస్ట్ అధికారులు హతవుల్లా, హల్తాప్ హుస్సేన్ అందజేశారు.