హాజీపూర్, జూలై 29 : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హాజీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ హాస్పిటల్‌లోని వార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. హాస్పిటల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా ఉండాలని సూచించారు.
హాజీపూర్‌లోని నర్మద ఫర్టిలైజర్ ఎరువుల దుకా ణం, పడ్తన్పల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాన్ని కలెక్టర్ దీపక్ కుమార్ ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, రశీదు పుస్తకాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాలు, యూరియా అందుబాటులో ఉన్నాయని తెలిపా రు. రైతులకు విక్రయించేటప్పుడు రిజిస్టర్లో న మోదు చేయడంతో పాటు తప్పనిసరిగా రశీదు ఇ వ్వాలని, దుకాణం ఎదుట ధరల పట్టిక, స్టాకు వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని, నకిలీ, నిషేధిత మందులు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పడ్తన్పల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, భవిత కేంద్రం, సబ్బెపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. సౌకర్యాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదులు, హాజరు, పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులకు మోనూ ప్రకారం నాణ్యమైన ఆహారం, శుద్ధజలం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, ఏవో కృష్ణ ఉన్నారు.